Home Bigg Boss 5 telugu వైరల్ అవుతున్న బిగ్‌బాస్ “షణ్ముఖ్-సిరి” లిప్‌లాక్ వీడియో..! “ఇందులో నిజం ఎంత?” అంటూ కామెంట్స్..!

వైరల్ అవుతున్న బిగ్‌బాస్ “షణ్ముఖ్-సిరి” లిప్‌లాక్ వీడియో..! “ఇందులో నిజం ఎంత?” అంటూ కామెంట్స్..!

by Mohana Priya

బిగ్ బాస్ తెలుగు-5 లో ఇప్పటికే షణ్ముఖ్, సిరి మధ్య జరుగుతున్న సంఘటనలకి సంబంధించిన వార్తలు చాలా చర్చలకి దారి తీస్తున్నాయి. వారిద్దరి మధ్య గొడవలు జరగడం, మళ్లీ మాట్లాడుకొని కలిసిపోవడం, ఇది అంతా కొద్ది రోజుల నుంచి నడుస్తూనే ఉంది. వీరిద్దరూ షోకి రాకముందు నుండి చాలా మంచి స్నేహితులు అని అందరికి తెలుసు. బిగ్ బాస్ లోకి వచ్చాక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

video of shanmukh siri kissing in bigg boss telugu 5 goes viral

ఇదిలా ఉండాగా, ఇటీవల షోకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ ఎందుకు అయ్యిందో ఎవరికీ అర్ధం అవ్వలేదు. ఈ నేపధ్యంలో వారిద్దరి మధ్య కొంచెం సేపు చర్చ జరిగింది. ఈ క్రమంలో, షణ్ముఖ్ కి సిరి ముద్దు పెట్టినట్టు ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ తర్వాత సిరి షన్ను హగ్ చేసుకోవడం కూడా ఈ వీడియోలో ఉంది. కొంత మంది, “ఇది కేవలం హగ్ మాత్రమే, ముద్దు పెట్టడంలాంటివి ఏం జరగలేదు” అంటుంటే, మరి కొందరు ఏమో కాదు అని అంటున్నారు.

video of shanmukh siri kissing in bigg boss telugu 5 goes viral

ఏదేమైనా ఈ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంక షో విషయానికి వస్తే, ఇవాళ నాగార్జున వచ్చి, వారం మొత్తం జరిగిన విషయాల గురించి మాట్లాడుతారు. ఈ వారం మానస్ కెప్టెన్ అయ్యారు. ఇవాళ డేంజర్ జోన్ నుండి బయటకు వచ్చే కంటెస్టెంట్ పేర్లు నాగార్జున చెప్తారు. ఎలిమినేట్ అయ్యే వారు ఎవరో రేపటి ఎపిసోడ్ లో చెప్తారు.

watch video :

https://twitter.com/PingPon82285459/status/1461432418263609356

You may also like