మలయాళం స్టార్ హీరో షూటింగ్ సెట్ లో… బిర్యానీ వండిన “సూర్య”..! వైరల్ అవుతున్న వీడియో..!

మలయాళం స్టార్ హీరో షూటింగ్ సెట్ లో… బిర్యానీ వండిన “సూర్య”..! వైరల్ అవుతున్న వీడియో..!

by Mohana Priya

Ads

సూర్య తమిళ్ స్టార్ హీరో అయినా కూడా తెలుగులో అంతే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు తెలుగులో మాత్రమే కాకుండా సూర్య దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాగే బాలీవుడ్ లో కూడా సూర్యకి చాలా మంచి పాపులారిటీ ఉంది. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సూర్య భార్య జ్యోతిక కూడా హీరోయిన్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు జ్యోతిక మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

సూర్య జ్యోతికని చూడడానికి ఈ సినిమా షూటింగ్ కి వెళ్లారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో సూర్య బిర్యానీ వండుతూ కనిపిస్తూ ఉన్నారు. అలాగే తర్వాత అక్కడ ఉన్న వారందరితో కలిసి సూర్య, జ్యోతిక బిర్యానీ కూడా తిన్నారు. వీరితో పాటు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న మలయాళం సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఉన్నారు. సాధారణంగా సూర్య అంటే చాలా మంచి వ్యక్తి అని, అంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా అందరితో కలిసిపోతూ చాలా సరదాగా ఉంటారు అని అంటూ ఉంటారు.

video of suriya cooking biryani goes viral
ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా సూర్య నిజంగా చాలా మంచివారు అని ఇంకా పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య ఇటీవల విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో కనిపించారు. సూర్య కనిపించింది కొంచెం సేపే అయినా కూడా పాత్రకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అంతా ఇంతా కాదు. దాంతో విక్రమ్ కొనసాగింపుగా వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

watch video :


End of Article

You may also like