Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్లో మహేష్ బాబు చాలా స్టైలిష్గా, డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలోని రెండు పాటలు ఇటీవల విడుదల అయ్యాయి.
Video Advertisement
గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు లుక్ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో సినిమాకి సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా రిజల్ట్ ఇలాగే ఉండబోతోంది అంటూ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీకి ప్రముఖ జ్యోతిష్కులు నందిభట్ల శ్రీహరి శర్మ చెప్పారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్తూ, “ఆగస్ట్ 2021 నుండి ఆగస్ట్ 2024 వరకు గొప్ప గొప్ప హిట్ సినిమాలు ఉంటాయని, సర్కారు వారి పాట సినిమా రిజల్ట్ విషయంలో తిరుగేలేదు” అని చెప్పారు. “ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది” అని చెప్పారు.
అంతే కాకుండా మహేష్ బాబు బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ స్థాయి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. సర్కారు వారి పాట సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నారు. అలాగే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కూడా నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కథ గురించి చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు.
watch video :
End of Article