Viral Video : క్లాస్ రూమ్ లో టీచర్ల డాన్స్… షాక్ ఇచ్చిన ఉన్నతాధికారి.!

Viral Video : క్లాస్ రూమ్ లో టీచర్ల డాన్స్… షాక్ ఇచ్చిన ఉన్నతాధికారి.!

by Mohana Priya

Ads

సాధారణంగా మనలో చాలా మంది ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు డాన్స్ చేయడం అనేది సహజం. అయితే, ఇలా డాన్స్ వేయడం కొన్ని పరిసరాలకు మాత్రమే పరిమితం అయ్యి ఉంటుంది. ప్రతి చోట ఇలాగే ఉండలేము కొన్ని చోట్లని బట్టి వాటికి ఇచ్చే గౌరవంతో అక్కడ కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అందులో పాఠశాల కూడా ఒకటి. పాఠశాలలో ఏదైనా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే లాంటి వేడుకలు అయ్యినప్పుడు పిల్లలు డాన్స్ వేస్తూ ఉంటారు.video of teachers dance in class room goes viral

Video Advertisement

కానీ సాధారణ రోజుల్లో చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టీచర్ అయితే స్టూడెంట్స్ క్రమశిక్షణగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల జరిగిన ఓ ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, ఆగ్రాలోని ఒక ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో ఐదుగురు టీచర్లు ఒక హిందీ పాటకి డాన్స్ వేస్తున్నారు. వీరంతా ప్రాథమిక విద్యాశాఖ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. టీచర్ల సర్వీస్ రూల్స్ అతిక్రమించి, విద్యాశాఖ ప్రతిష్టను దెబ్బ తీశారు అని ఆ సంబంధిత ప్రాథమిక శిక్ష అధికారి బ్రజరాజ్ సింగ్ వీరికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.video of teachers dance in class room goes viral

క్లాస్ రూమ్ లో డాన్స్ చేయడానికి గల కారణాలు కూడా చెప్పాలి అని ఆదేశించారు. ఐదుగురు టీచర్లలో నలుగురు టీచర్లు వివరణ ఇవ్వగా, ఇంకొక టీచర్ వివరణ ఇవ్వలేదు. ఇందులో నలుగురు అసిస్టెంట్ టీచర్లు ఒక హెడ్ టీచర్ ఉన్నారు ఈ ఏడాది మార్చి 21వ తేదీన టీచర్లు డాన్స్ వేశారు. కానీ ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like