Ads
కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. గత శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.
Video Advertisement
అయితే, పునీత్ రాజ్‌కుమార్ చేసిన ఒక పొరపాటు కారణంగా ఇలా జరిగింది అని వార్తలు వచ్చాయి. పునీత్ కి వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం. ఒక్క రోజు కూడా వ్యాయామం చేయకుండా లేరు. పునీత్ వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఈ వయసులో అంత కఠినమైన వ్యాయామం చేయడం వలన ఆరోగ్యానికి ముప్పు ఉంటుంది అని అంటారు. అంతే కాకుండా, పునీత్ కి గత గురువారం రాత్రి గుండెలో కొంచెం నొప్పిగా అనిపించింది అని, ఆ నొప్పితోనే వ్యాయామం చేయడానికి వెళ్లారు అనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే పునీత్ కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పునీత్ “నేను వచ్చే సంవత్సరం రాఘవేంద్రస్వామి మఠానికి వస్తాను” అని చెప్తున్నారు. కానీ అప్పుడు వెనకాల ఉన్న వీణ పడిపోవడం మనం ఈ వీడియోలో గమనించొచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా దీని వెనకాల ఏమైనా కారణం ఉందా? అనేది మిస్టరీగానే మిగిలిపోయింది.
watch video :
https://www.youtube.com/watch?v=U5zSQL1AYLQ
End of Article