చైనా పక్కనే ఆ దేశం..అయినా కరోనా మృతులు జీరో.! ఎలా కట్టడి చేసిందో తెలుసా?

చైనా పక్కనే ఆ దేశం..అయినా కరోనా మృతులు జీరో.! ఎలా కట్టడి చేసిందో తెలుసా?

by Megha Varna

Ads

ప్రపంచ దేశాల ప్రభుత్త్వాలన్నిటిని కరోనా వైరస్ కలవరపెడుతుంది.అగ్రరాజ్యం అమెరికా సైతం గజగజ వణికిపోతోంది . చైనాలో మొదలైన ఈ పెనుభూతం ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది . ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవ్వడంతోపాటు వేలాది మంది మరణిస్తున్నారు .ఇదిలా ఉండగా ఇప్పుడు అందరి ద్రుష్టి ఆ చిన్న దేశం మీదే ..ఎందుకంటే ఆ దేశం కారోనా మహమ్మారిని దీటుగా ఎదురుకోగలిగింది. పైగా ఆ దేశం చైనాకి అత్యంత చేరువలో వుంది .

Video Advertisement

ఇక్కడ కేసులు ఏమి లేకపోలేదు. వున్నాయి, కానీ అవి అత్యంత తక్కువగా.. అంటే వందల సంఖ్యలో ఉండడం.. పైగా మరణాల సంఖ్య పూర్తిగా లేకపోవడంతో ప్రపంచం ద్రుష్టి ఆ దేశంపై పడింది .ఆ దేశమే వియత్నాం ..వియత్నాం అధికార కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు తీసుకున్న తక్షణ చర్యల వలన ఆ దేశ ప్రజలు సురక్షితంగా వున్నారు .అసలు ఈ కారోనా వైరస్ ని ఎలా ఏ విధంగా అదుపు చేయగలిగింది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రపంచ ప్రభుత్త్వాలన్నీ తెగ ప్రయత్నిస్తున్నాయి.

వియత్నాం ..ఇక్కడ వైద్య బృందం మరియు వైద్య సదుపాయాలు చాలా తక్కువ .కేవలం 8 మిలియన్ల జన సాంద్రత కలిగిన నగర రాజధాని హొచిమిన్ .చైనాలో ప్రఖ్యాత నగరమైన వుహాన్ లో 2019 చివరిలో మొదలైంది కరోనా వైరస్ . అసలే వైద్య సదుపాయాలు తక్కువగా ఉండడంతో చాల ముందుగానే జాగ్రత్తలు తీసుకుంది వియత్నాం ప్రభుత్వం .

చైనాలో జనవరి 20నుండి పూర్తి లాక్ డౌన్ ప్రకటించగా అంతకంటే 19 రోజుల ముందు వియత్నాం లాక్ డౌన్ చేసారు . పక్కనే వున్నా చైనాలో పుట్టిన కరోనా వైరస్ తమ దేశంలో ఎవరికీ సోకింది అని దానిపై ఆరాతీసి వారికోసం గాలింపు చర్యాలు ముమ్మరం చేసారు. దీనిలో అధికార కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు కీలక పాత్రా వహించారు .

ఒక విధంగా చెప్పాలంటే ఒక హాంటింగ్ సెర్చ్ ఆపరేషన్ లా జరిగింది. మొదట కారోనా వ్యాధిగ్రస్తులను గుర్తించి వారిని నిర్బంధించారు. తరువాత వీరు ఎవరిని కలిశారు ఎవరితో సన్నిహితంగా వున్నారు అని తదితర అంశాలను తెలుసుకొని వారిని కూడా ఎక్కడికి వెళ్లకుండా నిర్బంధించారు.

కరోనా బాధితులు తిరిగిన ప్రదేశాలని కలిసిన వ్యక్తులని నాలుగు భాగాలుగా విభజించారు . వాళ్లందరికీ కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చినవారిని హౌస్ అరెస్ట్ చేసి వైరస్ విజృంభించకుండా కట్టడి చేసారు .తదుపరి చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ విధించారు . మూడు వారలు , నెల రోజులు దీనిని అమలు జరిపారు . లాక్ డౌన్ విధించడం వలన ఆర్ధిక రంగంపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అని కొత్తగా కేసులు నమోదు కాని ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తి వేశారు .

అసలు ఈ వృత్తాంతంలో ప్రధానమైంది ఏంటంటే ముందుగానే వ్యాధిగ్రస్తులను గుర్తించి నిర్బంధించి వారు కలిసిన వారికి కూడా పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చినవారిని హౌస్ అరెస్ట్ చేసి సరైన సమయంలో లాక్ డౌన్ విధించి జనాలకు అవగాహన కల్పించి విపరీతంగా మాస్క్ లు, శానిటైజర్లు పంపిణి చేసింది.ఇలా అనేక ముందస్తు చర్యలతో ఆ దేశ ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందకుండా బాగానే అరికట్టింది .మొత్తం మీద ఆ దేశానికీ ముందు చూపు బాగా వర్క్ అవుట్ అయింది .


End of Article

You may also like