Bichagadu 2 Review : “విజయ్ ఆంటోని” నటించి, దర్శకత్వం వహించిన బిచ్చగాడు 2 ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Bichagadu 2 Review : “విజయ్ ఆంటోని” నటించి, దర్శకత్వం వహించిన బిచ్చగాడు 2 ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత యాక్టర్ గా మారిన వ్యక్తి విజయ్ ఆంటోనీ. విజయ్ ఆంటోని నటించిన అన్ని సినిమాలు కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటాయి. ఇప్పుడు విజయ్ ఆంటోనీ కొద్ది సంవత్సరాల క్రితం విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన బిచ్చగాడు సినిమా సీక్వెల్ అయిన బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : బిచ్చగాడు 2
  • నటీనటులు : విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి.
  • నిర్మాత : ఫాతిమా విజయ్ అంటోనీ
  • దర్శకత్వం : విజయ్ ఆంటోనీ
  • సంగీతం : విజయ్ అంటోని
  • విడుదల తేదీ : మే 19, 2023

bichagadu 2 movie review

స్టోరీ :

విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశం మొత్తంలోనే ఏడవ ధనిక వ్యక్తి అవుతాడు. అయితే విజయ్ మీద తన దగ్గర వాళ్లు ఒకరు విజయ్ ఎదుగుదలని అడ్డుకోవడానికి చూస్తారు. ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల విజయ్ కి బ్రెయిన్ ఇంప్లాంటేషన్ అవుతుంది. ఆ బ్రెయిన్ సత్య అనే ఒక వ్యక్తిది. ఈ బ్రెయిన్ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత విజయ్ సత్యలాగా ఆలోచించడం మొదలు పెడతాడు. సత్యకి కూడా ఒక కథ ఉంటుంది. అసలు సత్య ఎవరు? అతని కథ ఏంటి? విజయ్ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తర్వాత విజయ్ ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

bichagadu 2 movie review

రివ్యూ :

విజయ్ అంటోనీ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలు ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు తన దర్శకత్వంలోనే బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన బిచ్చగాడు సినిమా సీక్వెల్. ఆ సినిమాకి డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

bichagadu 2 movie review

దాంతో సీక్వెల్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూశారు. సినిమా మొదలవ్వడం చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. మొదలైన ఒక 15 నిమిషాలకే సినిమా వేరే ఏ పాయింట్ పై దృష్టి పెట్టకుండా కేవలం కథపై మాత్రమే దృష్టి పెట్టి మెయిన్ పాయింట్ ని ముందే చూపిచ్చేస్తుంది. దాంతో ఒక కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమా చూస్తున్నాం అనే ఒక ఫీలింగ్ ప్రేక్షకుడికి సినిమా మొదలైన కొంచెం సేపటికి వచ్చేస్తుంది. ఇంటర్వెల్ వరకు కూడా సినిమా ఆసక్తికరంగా నడుస్తుంది.

bichagadu 2 movie review

కానీ ఆ తర్వాత సినిమా ముందుకి వెళ్తున్న కొద్ది ఒక రొటీన్ సినిమాలాగా అయిపోతుంది. సాధారణంగా చాలా సినిమాల్లో ఫస్ట్ హాఫ్ మామూలుగా నడిచి సెకండ్ హాఫ్ లో కొంచెం స్టోరీ బాగా ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా అయిపోతుంది. అసలు పేరు వినగానే ఇది మొదటి భాగానికి సీక్వెల్ అని అనుకుంటారు.

bichagadu 2 movie review

అందులో ఉన్నట్టే ఇందులో కూడా తల్లి సెంటిమెంట్ ఉంటుంది అని, కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అని అనుకుంటారు. కానీ అసలు మొదటి భాగంలో ఉన్న స్టోరీకి దీనికి ఏం సంబంధం ఉండదు. ఈ సినిమాకి ఈ టైటిల్ సరిపోతుంది కాబట్టి ఈ పేరు పెట్టారు. సినిమా కాన్సెప్ట్ బాగున్నా కూడా తెరపై చూపించడంలో చాలా చోట్ల విఫలం అయ్యారు. సత్య అనే పేదవాడు, విజయ్ అనే ఒక డబ్బున్న వ్యక్తి, వీరిద్దరి ఆలోచనలు మారడం, ఇదంతా చాలా రెగ్యులర్ గా కాకపోయినా ప్రేక్షకులకు తెలిసిన కథ.

bichagadu 2 movie review

దర్శకుడు విజయ్ అంటోని తాను అనుకున్న పాయింట్ ని ఒక సినిమా రూపంలో తెరపై చూపించడానికి చేసిన ప్రయత్నంలో, అసలు సినిమాలో తాను ఇవ్వాలి అనుకున్న మెసేజ్ సరిగ్గా ఇవ్వలేకపోయారు. కొన్ని చోట్ల సీన్స్ అతిగా అనిపిస్తాయి. మళ్లీ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషన్ యాడ్ చేశారు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విజయ్ ఆంటోనీ పాత్ర పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలా అని బాలేదు అని కూడా చెప్పలేం. ఆ పాత్రకి తగ్గట్టుగా చేశారు అంతే.

bichagadu 2 movie review

హీరోయిన్ గా నటించిన కావ్య పాత్ర చాలా కమర్షియల్ సినిమాల్లో చూసే హీరోయిన్ పాత్ర లాగానే ఉంది. యోగి బాబు లాంటి మంచి నటుడిని పెట్టారు కానీ, ఆయనకు ఇచ్చిన సీన్స్ అంత బలంగా ఏమీ అనిపించవు. సినిమా ఆసక్తికరంగా మొదలు అయినా కూడా, తర్వాత ముందుకు వెళ్తున్నప్పుడు అదే ఆసక్తి ప్రేక్షకులకు ఉండేలా సినిమా చూపించి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • ఎంచుకున్న పాయింట్
  • క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్
  • చాలా అతిగా అనిపించే సీన్స్
  • గ్రాఫిక్స్
  • రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

మొదటి భాగం అసలు చాలా సైలెంట్ గా విడుదల అయ్యింది. ప్రేక్షకులకు కూడా పెద్దగా అంచనాలు లేకపోవడంతో అప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అసలు సినిమా ఎలా ఉంటుంది, స్టోరీ ఏంటి అని చూద్దాం అనుకునే వారికి బిచ్చగాడు 2 సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like