విజయ్ ఆంటోనీ కూతురు చనిపోయే ముందు రాసిన చివరి లెటర్..! “వాళ్లని మిస్ అవుతాను..!” అంటూ..?

విజయ్ ఆంటోనీ కూతురు చనిపోయే ముందు రాసిన చివరి లెటర్..! “వాళ్లని మిస్ అవుతాను..!” అంటూ..?

by kavitha

Ads

తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత విజ‌య్ ఆంటోనీ కుమార్తె మీరా బలవన్మరణానికి పాల్ప‌డడం ప్రతి ఒక్కరినీ క‌ల‌చి వేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చ‌దువుతున్న మీరా ఇంట్లో మంగళవారం ఉదయం ఉరి వేసుకుని కన్నుమూసింది.

Video Advertisement

మీరా మరణానంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 20 ఏళ్ల కెరీర్ లో ఎలాంటి వివాదం లేకుండా, చాలా అణ‌కువ‌తో ఉండే హీరో విజ‌య్ ఆంటోనీ కుమార్తెను కోల్పోవడం అంద‌రినీ బాధకు గురి చేస్తోంది. మీరా మృతి పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కుమార్తె మీరా మరణంతో విజయ్ ఆంటోనీ దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. పోస్ట్ మార్టం అనంతరం మీరా భౌతిక కాయాన్ని విజయ్ ఆంటోనీ దంపతులు ఇంటికి తరలించారు. మీరాను కడసారి చూడడం కోసం తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు విజయ్ నివాసానికి తరలి వస్తున్నారు. విజయ్ ఆంటోనీని ఓదారస్తున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు ధైర్యం చెప్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
మీడియాతో చాలా త‌క్కువగా మాట్లాడే విజ‌య్ ఆంటోనీ గతంలో ఆత్మ‌హ‌త్యకు వ్య‌తిరేక అవ‌గాహ‌న కలిగించే ప్రోగ్రామ్స్ కు ప్ర‌చార‌క‌ర్త‌గా పాల్గొన్నారు. అప్పుడు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన కుమార్తె అలా చేసుకోవడం అందరినీ వేదనకు గురిచేస్తోంది. మీరా మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మీరా స్కూల్, ఆమె ఫ్రెండ్స్ ను విచారించారు. మీరా ల్యాప్‌టాప్ మొదలుకొని ఆమె ఉపయోగించే వస్తువులను పరీక్షిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో మీరా సోమవారం రాత్రి 11 గంటల వరకు తన ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిందని, ఆ తర్వాత మీరా ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మీరా పాఠ్యపుస్తకంలో ఒక లెటర్ దొరికిందని అంటున్నారు. ఆ లెటర్ లో మీరా తన ఫ్రెండ్స్ ను, టీచర్స్ ను మిస్ అవుతున్నానని  పేర్కొంది. అందరూ సురక్షితంగా మరియు సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్ !! థాంక్యూ ఆల్ !! అని రాసినట్టు  చెబుతున్నారు.

Also Read: హీరో విజయ్ ఆంటోని కూతురు ఆ-త్మ-హ-త్య ఎందుకు చేసుకుంది..? కారణం ఇదేనా..?


End of Article

You may also like