Ads
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బిచ్చగాడు మూవీతో సూపర్ ఫేం సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.
Video Advertisement
విజయ్ ఆంటోనీ నటించిన లేటస్ట్ కోలీవుడ్ సినిమా రత్తం. ఈ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సీఎస్ ఆముధన్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీటాలెంటెడ్ స్కిల్స్ ఉన్నవ్యక్తి విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన లేటెస్ట్ తమిళ మూవీ రత్తం అక్టోబర్ 6న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నందితాశ్వేత, మహిమా నంబియార్, రమ్య నంబీశన్ కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, స్టోరీ పరంగా రత్తం కొంచెం డిఫరెంట్ లైన్. కోల్‌కతాలో గుర్రాల కాపరిగా పని చేస్తుంటాడు రంజిత్(విజయ్ ఆంటోనీ). గతంలో తనకు మీడియా గురువు అయిన రత్నం పాండియన్ (నిళల్ గళ్ రవి) కుమారుడు హ-త్య-కు గురవుతాడు. గురువు ఈ కేసును సాల్వ్ చేసేపనిని రంజిత్ కు అప్పగిస్తాడు. రంజిత్ చెన్నైకి వచ్చి ఆయన సంస్థలోనే జాయిన్ అవుతాడు.
మధుమిత(నందిత దాస్) దగ్గర అప్రెంటీస్ గా చేరి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా, అలాంటి హత్యలే రాష్ట్రంలో చాలా జరిగాయనే విషయం తెలుస్తుంది. మరి ఈ హ-త్య-ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎలాంటి ఆధారాలు లేకుండా దొరకకుండా చేస్తున్నది ఎవరు? ఈ మ-ర్డ-ర్స్ ఎందుకు చేస్తున్నారు? ఈ కేసును ఛేదించే క్రమంలో రంజిత్‌కు ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? రంజిత్ జర్నలిజం వృత్తికి ఎందుకు దూరంగా వెళ్ళాడు అనేది మిగిలిన కథ.
మైండ్‌గేమ్‌తో హీరో మరియు విలన్ ఒకరి పై ఒకరు వేసే ఎత్తులతో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ రంజిత్‌కుమార్ గా విజయ్ ఆంటోనీ సీరియస్ పాత్రలో మెప్పించాడు. మహిమా నంబియార్ నటన ఆకట్టుకుంటుంది. రత్తం మూవీ ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. కథతో పాటుగా విలన్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓపికగా చూడగలిగిన వారికి కొత్త అనుభూతిని ఇస్తుంది.
Also Read: లోకేష్ కనగరాజ్ తీసిన మొదటి సినిమా గురించి తెలుసా..? అది కూడా ఒక తెలుగు హీరోతో..?
End of Article