నాగబాబు తాజాగా హీరో బాలకృష్ణ మీద కొన్ని వ్యాఖ్యలు చేసారు.కాగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.సినిమా వర్గానికి సంభందించిన ఓ మీటింగ్ కు బాలయ్య బాబు ని పిలవకపోవడం వలన ఈ వివాదం మొదలైంది.అయితే యువ దర్శకుడు త్రిపురనేని విజయ్ చౌదరి నాగబాబు పై భారీ స్థాయిలో ఫైర్ అయ్యారు.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం …

Video Advertisement

నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్ గా విజయ్ చౌదరి స్పందిస్తూ ఒక వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు.నాగబాబు పై అసభ్యపదజాలంతో అంటూ ఫైర్ అయ్యారు విజయ్ చౌదరి.అసలు మెగాస్టార్ చిరంజీవి ,పవన్ కళ్యాణ్ లేకపోతె పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని విజయ్ చౌదరి అన్నారు.మీ స్వార్థం వలనే కాపు సామాజిక వర్గంలో ఇంకో హీరో రాలేకపోయారు అని విజయ్ చౌదరి కామెంట్ చేసారు.

బాలయ్య బాబు నటన ముందు నువ్వు సరిపోతావా అంటూ మండిపడ్డారు.లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే వాడు కాదు మా బాలయ్య బాబూ మిరే దొంగ మీదే దొంగ బుద్ధి అని అన్నారు విజయ్ చౌదరి.బాలయ్యబాబు మీద ని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తే గాజులు వేసుకొని కూర్చున్నవాడు ఎవడూ లేడు ఇక్కడ నువ్వు మాటలతో పేలితే నికంటే బాగా పేలగాలను అంటూ విజయ్ చౌదరి ఘాటూ వ్యాఖ్యలతో మండిపడుతూ వీడియో ను ముగించారు విజయ్ చౌదరి.