Ads
సోషల్ మీడియాలో నిజం కంటే ఎక్కువ అబద్దమే ఉంటుంది. సైబర్ క్రైమ్ గురించి మనం ఎన్నో సార్లు వినే ఉంటాం. ఎవరో పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకోవడం, దాని నుండి చాలామందికి మెసేజ్ చేయడం, ట్రాప్ చేయడం, ఏదో ఒక రకంగా బెదిరించి డబ్బులు తీసుకోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కువమంది ఫేక్ ఐడి క్రియేట్ చేసేది మాత్రం సెలబ్రిటీల పేరుమీదే.
Video Advertisement
జనాల్లో బాగా క్రేజ్ ఉన్న ఒక సెలబ్రిటీ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, గూగుల్ నుండి సెర్చ్ చేసిన ఇమేజెస్ ని కెమెరా ఫిల్టర్స్ వాడి ఆ ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో లేదా ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసి ఆ అకౌంట్ సెలబ్రిటీదే అన్నట్టు క్రియేట్ చేస్తారు.
ఒక రకంగా చెప్పాలంటే కొంత మంది ఫ్యాన్స్ అభిమానాన్ని ఇలాంటి సైబర్ క్రైమ్ మోసగాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు సెలబ్రిటీలతో పాటు వాళ్ళ పిల్లల పేరు మీద కూడా ఇలాంటి అకౌంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేయకపోయినా కూడా డబ్బింగ్ సినిమాల ద్వారా మన అందరికీ ఎంతో దగ్గరయ్యారు విజయ్. ప్రస్తుతం ట్విట్టర్ లో విజయ్ కూతురు దివ్య సాషా పేరు మీద ఒక అకౌంట్ ఉంది. 2020 మొదట్లో అంటే ఫిబ్రవరిలో ఈ అకౌంట్ ట్విట్టర్ లో దర్శనమిచ్చింది.
అప్పటినుండి దివ్య ఫోటోలు, విజయ్ ఫోటోలు ఈ అకౌంట్ లో పోస్ట్ అవుతున్నాయి. విజయ్ ఫాన్స్ ఈ అకౌంట్ నిజమా కాదా సందేహం లో ఉన్నారు. ఇటీవల తమిళ్ హీరో, ఇంకా ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కొడుకైన శాంతను పుట్టినరోజు నాడు దివ్య సాషా అకౌంట్ నుండి విషెస్ పోస్ట్ అయ్యాయి. దానికి శాంతను థాంక్యూ అని రిప్లై ఇచ్చారు.
దాంతో ఇది నిజంగా విజయ్ కూతురు దివ్య అకౌంట్ అని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. అప్పటినుండి దివ్య కి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. రోజు రోజుకి ఫాలోవర్స్ పెరుగుతుండటంతో 14 ఏళ్ల వయసులోనే ఎంతో పాపులర్ అయింది దివ్య. కొంతమంది ఇది ఫేక్ అకౌంట్ అంటున్నారు, కానీ మరికొంతమంది మాత్రం ఇది నిజంగా దివ్య అకౌంట్ అని అంటున్నారు.
కొంతకాలం క్రితం విజయ్ కొడుకు పేరు మీద ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ అయింది. కానీ అది తనది కాదు అని విజయ్ కొడుకు చెప్పారు అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు దివ్య సాషా విజయ్ పేరుతో ఉన్న ఈ అకౌంట్ కూడా నిజమో కాదో ఎవరికీ తెలీదు.
End of Article