“అది మా రౌడీ హీరో అంటే..!” అంటూ… “విజయ్ దేవరకొండ”ని పొగడ్తల్లో ముంచేస్తున్న నెటిజెన్స్ కారణమేంటంటే..?

“అది మా రౌడీ హీరో అంటే..!” అంటూ… “విజయ్ దేవరకొండ”ని పొగడ్తల్లో ముంచేస్తున్న నెటిజెన్స్ కారణమేంటంటే..?

by Mohana Priya

ఫోన్ ఓపెన్ చేస్తే లెగర్, టీవీ ఆన్ చేస్తే లైగర్, ఇలా ఎటు చూసినా, ఏమి విన్నా లైగర్ మూవీ పేరే వినిపిస్తుంది, కనిపిస్తుంది. మరి అక్కడ నటించింది విజయ్ దేవరకొండ అయితే, ఆ సినిమాని డైరెక్ట్ చేసింది పూరీ జగన్నాథ్. వీళ్ళకి ఉన్న ఫాలోయింగ్ క్రేజ్ అలాంటిది మరి. ఎవరికి వాళ్లకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇద్దరూ కలిస్తే మామూలుగా ఉండదు అనే ఫీలింగ్ లో ఉన్నారు అభిమానులు. కచ్చితంగా హిట్ అయ్యి తీరుతుంది అని ఫిక్స్ అయిపోయారు.

Video Advertisement

అయితే ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి అయిదు భాషల్లో ఆగస్ట్ 25న ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ను లైగర్ కాస్ట్ అండ్ క్రూ భారీగా చేస్తున్నారు. ఈ సినిమాకి విజయ్ దేవరకొండ దాదాపు 35 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. అటు ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ కి అంతకంటే ఎక్కువ 40 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్ అనన్య పాండేకు మాత్రం కేవలం 3 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కి విజయ్ వినూత్నంగా ప్రయాణిస్తున్నాడు.

does these things become plus points for vijay devarakonda liger movie

ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా పెద్ద హీరోల జాబితాకే వచ్చేశాడు. ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటూ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అతని స్థాయి చూపించుకోకుందా చాలా సాధారణంగా, మన ఇంటి అబ్బాయి బయటకి వెళ్లినట్టు సింపుల్ టీషర్ట్ ప్యాంట్ వేసుకుని, స్లిప్పర్లు వేసుకుని తిరుగుతున్నాడు. అంతే కాదు, హీరో విజయ్, హీరోయిన్ అనన్య కలిసి ఫ్లైట్ లో కూడా ఎకనమిక్ క్లాస్ లో ఎక్కారు.

vijay devarakonda

ఈ ఫోటోను, లైగర్ సినిమా నిర్మాత ఛార్మీ, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ… విజయ్ లాంటి గ్రేట్ యాక్టర్ ను చూడలేదు అని, చాలా డౌన్ టు ఎర్త్ పీపుల్ అనన్య, విజయ్ సో క్యూట్ అంటూ పోస్ట్ చేశారు కూడా. మరోవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ… విజయ్ లక్షరీ కారు కంటే, సింపుల్ గా ఉన్న ఆటో రిక్షానే ప్రిఫర్ చేశాడు. ఆడంబరాన్ని చూపించుకోకుండా విజయ్ ఇలా ప్రమోషన్స్ కి సామాన్యుడిగా వెళ్ళడం ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. దీంతో అభిమానం కూడా మరింత పెరిగింది. దీనిపై ప్రజలు స్పందిస్తూ విజయ్ ను కామెంట్ల రూపంలో పొగడ్తలతో ముంచెత్తారు. కాగా అనన్య కు ఒకేసారి అయిదు భాషల్లో రిలీజ్ కానున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.


You may also like