Home Filmy Adda నేను చేయగలిగింది చేసా..! “విజయ్ దేవరకొండ” కామెంట్స్..!

నేను చేయగలిగింది చేసా..! “విజయ్ దేవరకొండ” కామెంట్స్..!

by Megha Varna

ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా హిట్ అవ్వలేదు. భారీ ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులు పెట్టుకున్నా డిసప్పాయింట్ చేసింది. మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇలా విజయ్ దేవరకొండ కి కాలం కలిసి రావడం లేదు.

భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఊహించిన ఫలితాలు ఈ సినిమాకి అందలేదు. లైగర్ సినిమా హిట్ అవ్వకపోవడం తో సినిమాను కొనుగోలు చేసిన వాళ్లకి నష్టాలు వచ్చాయి.

liger climax scene is inspired from that super hit movie

అలానే పూరి జగన్నాధ్ పైన విమ‌ర్శ‌లు కూడా వచ్చాయి. కానీ ఈ విమర్శలు వింటున్నా కూడా నిశబ్దం గానే ఉంటున్నాడు పూరి జగన్నాధ్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమి సహజం అని విజయ్ దేవరకొండ అన్నారు. నిజానికి ఇలాంటి పెద్ద సినిమాలో నటించడమే గొప్ప అవకాశం అని విజయ్ చెప్పారు. పైగా ఆయన పాత్రని ఆయన ఆస్వాదించునట్లు చెప్పారు. అంతేకాక ఈ సినిమా కోసం దేశమంతా ప్రచారం చేశారు అయితే దేశమంతా ప్రచారం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని విజయ్ దేవరకొండ అన్నారు.

ఈ సినిమా కోసం శారీరకంగా మానసికంగా చేయగలిగిందంతా చేశానని అయినప్పటికీ ఫలితం దక్కలేదని చెప్పారు. అయితే తప్పు చేయడం అంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడం ఒకవేళ కనుక తప్పు చేయడం లేదు అంటే గట్టిగా వాళ్ళు ఉన్నత స్థానం గురించి ప్రయత్నం చేయడం లేదు అని విజయ్ చెప్పారు. సక్సెస్ వచ్చినా రాకపోయినా సరే ప్రయత్నం మాత్రం చేయాలని అందులో ఫెయిలవ్వకూడదని విజయ్ అన్నారు.

You may also like