సినిమాల్లో నటించే నటుల పట్ల సామాన్య ప్రజలకు ఎంతో ఆశక్తి ఉంటుంది. వారిపై మనకు గల అభిమానాన్ని ఆసరాగా చేసుకుని ఎంతో మంది ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా అలాంటి మోసమే విజయ్ దేవరకొండ విషయంలో జరిగింది. అమ్మాయిలలో విజయ్ దేవరకొండ అంటే చాలనే క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ని ఉపయోగించుకొని విజయ్ దేవరకొండ పేరుతో ఒక అజ్ఞాత వ్యక్తి అకౌంట్ ని క్రియేట్ చేయడం జరిగింది. తానే అసలైన విజయ్ దేవరకొండ అని ప్రచారం చేసుకుంటూ, ఫేస్ బుక్ లోని అమ్మాయిలకు మాయ మాటలు చెబుతూ తనని డైరెక్టుగా కలవడం కోసం ఇచ్చిన ఫోన్ నెంబర్ కి కాల్ చేయమని చెప్పి ట్రాప్ చేస్తూ ఉన్నాడు.

Video Advertisement

ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ తన మేనేజర్ సహాయంతో అమ్మాయిలాగా చాట్ చేయించి అతను అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా అతని పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ను నమోదు చేశారు. ఇలాంటి మోసాలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ ఇలాంటి ట్రాప్స్ లో అమ్మాయిలు ఇంకా మోసపోతూనే ఉన్నారు ఇలాంటి వాటి పట్ల ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ,పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫైటర్‌’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి దర్శత్వంలో వస్తున్న చిత్రం ఇది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌ మరియు ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ఫ్లాప్ కావ‌డం హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎప్పుడు ఆశలు మొత్తం ఫైటర్‌ సినిమా మీద పెట్టుకున్నాడు,సినిమా షూటింగ్ శరవేగంగా ముందుకు వెళ్తుంది,తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.