“పబ్లిక్ లో ఇలాంటి పదాలు మాట్లాడడం ఏంటి..?” అంటూ… “విజయ్ దేవరకొండ” మీద కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..?

“పబ్లిక్ లో ఇలాంటి పదాలు మాట్లాడడం ఏంటి..?” అంటూ… “విజయ్ దేవరకొండ” మీద కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..?

by Harika

Ads

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఇంకో రెండు రోజుల్లో విడుదల అవుతోంది. పరశురామ్ పెట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ లో ఈ సినిమాకి కొన్ని మ్యూట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. సినిమా బృందం అంతా కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వాడిన ఒక పదం మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి.

Video Advertisement

minus points in family star trailer

విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా కూడా తనదైన స్టైల్ మార్క్ ఉండాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు. అందుకోసం కష్టపడుతూ ఉంటారు. నిన్న తన ఎంట్రీ డిఫరెంట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో బైక్ మీద వేడుక జరుగుతున్న ప్రదేశానికి ఎంట్రీ ఇచ్చారు. ఇదే బైక్ మీద విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ తనకి ఎదురు పడి చాలా మంది రావడంతో వాళ్లని జరగండి అని చెప్తూ ఒక పదం వాడారు.

vijay devarakonda family star pre release event incident

“జరగాండ్రా” అని చెప్పి ఆ తర్వాత ఒక పదం వాడారు. ఆ పదం సాధారణంగా స్నేహితుల మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా చోట్ల మనం వింటాం. కానీ తెలియని వారిని మాత్రం అలాంటి పదాలు వాడరు. మనలో మనకి అది మామూలుగా అనిపిస్తుంది కానీ, బయట కొంత మంది దాన్ని అంత బాగా తీసుకోలేరు. అందుకే ఆ పదం బయట వాడితే అది తిట్టినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఈ పదం వాడడం చూసి ఇది స్నేహితుల మధ్యలో అనుకుంటే బానే ఉంటుంది కానీ, అందరూ ముందు అనడం ఏంటి పబ్లిక్ లో ఇలాంటి పదాలు వాడడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video:

ALSO READ : పుష్ప “రష్మిక” నుండి… లైగర్ “అనన్య పాండే” వరకు… ఇటీవలి కాలంలో ప్రేక్షకులకి చిరాకు తెప్పించిన 10 హీరోయిన్ పాత్రలు..!


End of Article

You may also like