దేవరకొండ ఫౌండేషన్ “మిడిల్ క్లాస్ ఫండ్” అంటే ఏంటి? ఎలా సహాయపడుతుంది?

దేవరకొండ ఫౌండేషన్ “మిడిల్ క్లాస్ ఫండ్” అంటే ఏంటి? ఎలా సహాయపడుతుంది?

by Megha Varna

Ads

అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన  హీరో విజయ్ దేవరకొండ.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన స్టయిల్ లో స్పందిస్తూ ఉంటారు విజయ్ దేవరకొండ . పేద మధ్య తరగతి కుటుంబాలకు సహాయం చేసే దిశగా ది దేవరకొండ ఫౌండేషన్ ను మొదలుపెట్టారు.

Video Advertisement

కాగా ఈ ఫౌండేషన్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..ఈ ఫౌండేషన్ ను స్థాపించడానికి రెండు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి . ఒకటి ఫ్యూచర్ అవసరాలు , రెండు ఇమ్మీడియేట్ అవసరాలు . ఒక వ్యక్తి కి చేప ఇస్తే ఆ రోజుకి తినేస్తాడు మళ్లీ తర్వాత రోజు చేప అవసరం అవుతుంది .అదే ఆ వ్యక్తికీ చేపలు పట్టడం నేర్పిస్తే ఇంక  జీవితంలో తనకు చేపలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు .దీనిని నేను బలంగా నమ్ముతాను అని తెలిపారు విజయ్ దేవరకొండ ..

మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది .పైగా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలామందిని జాబ్ లో నుండి తీసేసారు ఇది చాలా బాధాకరమని అన్నారు . ఈ నేపథ్యంలో ఇప్పటికే దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 600 మంది యువతి యువకులను సెలెక్ట్ చేసి వారికి జాబ్స్ వచ్చేలా సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇప్పించాము.ఈ 600 మందిలో 50 మంది బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తులను సెలెక్ట్ చేసాము .

అందులో ఇద్దరికి ఇప్పటికే ఎంప్లాయిమెంట్ వచ్చింది .మిగతా 48 మందికి కూడా ఎంప్లాయిమెంట్ వచ్చేది కానీ కరోనా కారణంగా బ్రేక్ పడింది అని తెలిపారు విజయ్ దేవరకొండ. నా వెనకాల 50 మంది ఎంప్లాయిమెంట్ పొందిన వారు ఉన్నారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.ఇలానే భవిష్యత్ లో కూడా చాలామందికి ఎంప్లాయిమెంట్ కల్పించేలా దేవరకొండ ఫౌండేషన్ కృషి చేస్తుంది అని తెలిపారు..

ఇలా యువతకు ఎంప్లాయిమెంట్ కల్పించే విధంగా సెప్టెంబర్ 2019 నుండి కృషి చేస్తున్నాము.కానీ ఈ విషయాన్నీ రహస్యంగా ఉంచడం జరిగింది .ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు అని అన్నారు విజయ్ . ఇక పోతే ఇమ్మీడియేట్ రిక్విర్మెంట్ … ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .బయటకి వెళ్లి పని చెయ్యడానికి లేదు .బయటికి వెళ్లి పనిచేస్తేనే గాని గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి .

కాబట్టి ఎవరైనా ఇంట్లో నిత్యావసర సరుకులు లేకుండా బాధపడుతూ ఉంటే మాత్రం thedevarakondafoundation.org వెబ్సైటు కి వచ్చి Ask help అనే టాబ్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ నమోదు చేసుకోండి .అప్పుడు మా బృందం మీకు కాల్ చేస్తుంది .అప్పుడు మీరు దగ్గరలో ఉన్న కిరాణ షాప్ కి వెళ్లి మీకు కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చు .తర్వాత ఆ బిల్ ను షాప్ ఓనర్ మాకు సెండ్ చేస్తారు . అప్పుడు మేము వెంటనే షాప్ ఓనర్ కి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాము అని తెలిపారు విజయ్ దేవరకొండ.

దేవరకొండ ఫౌండేషన్ ను మొదలుపెడుతూ విజయ్ 25 లక్షలు విరాళం ఇచ్చారు.ఇప్పుడు సినిమాలు ఆగిపోవడం వలన నా దగ్గర డబ్బులు లేవు అయినా సరే నా ఫ్రెండ్స్ దగ్గర అప్పుగా ఈ అమౌంట్ తీసుకున్నాను అని తెలిపారు.ఇప్పటిదాకా మాకు 74 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి .కాగా మేము ఇప్పటిదాకా 7400 కు పైగా కుటుంబాలకు నెలకు సరిపడా సరుకులను అందచేశాం. 4400 మంది డొనేట్ చేశారు.

ఎవరికైనా నిజంగా అవసరం ఉంటేనే ఇలా సరుకులు తీసుకోండి .మీకు అవసరం లేకపోతె వద్దు ఎందుకంటే మీ కారణంగా ఇంకో కుటుంబం నష్టపోకూడదు గా.లాక్ డౌన్ అయిపోయిన తర్వాత మీరు డబ్బులు తిరిగి ఇవ్వాలనుకుంటే వెబ్ సైట్ లోకి వచ్చి డొనేట్ చెయ్యండి తద్వారా మేము ఇంకో కుటుంబానికి సహాయం చేసే అవకాశం ఉంటుంది అని తెలిపారు విజయ్ దేవరకొండ .

ఇదే పరిస్థితి 5 సంవత్సరాల క్రితం” పెళ్లి చూపులు ” సినిమా టైములో వచ్చి ఉంటె నేను ఏమి చెయ్యలేకపోయేవాడిని . అప్పుడు నేను ఇంట్లో వాళ్ళ ఇన్కమ్ మీద ఆధారపడి ఉన్నాను ..మిడిల్ క్లాస్ కష్టాలు నాకు బాగా తెలుసు నేను కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చినవాడినే ప్రతీ నెల సరుకులు ఇంటి అద్దె, కరెంటు బిల్ , స్కూల్ ఫీజు ఇలా చాలా ఉంటాయి ..కాగా ఎవరూ కూడా ఫుడ్ లేకుండా బాధపడద్దు.మీకు అవసరం ఉంటె వెంటనే దేవరకొండ ఫౌండేషన్ వెబ్ సైట్లో వెంటనే తెలియచేయండి అని తెలిపారు విజయ్ దేవరకొండ . దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .ఇలాంటి కష్ట సమయంలో చాలా కుటుంబాలకు సహాయం చేస్తున్నాడు నిజంగా విజయ్ చాలా గ్రేట్ ,రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ..#hatsoff Vijay devarakonda #Jai Hind


End of Article

You may also like