విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ లిస్ట్…ఏ సినిమాకి ఎంత అంటే.?

విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ లిస్ట్…ఏ సినిమాకి ఎంత అంటే.?

by Mohana Priya

Ads

రౌడీ అన్న పదం వింటే అంతకుముందు రౌడీలే గుర్తొచ్చే వాళ్ళు. గత మూడు సంవత్సరాల నుండి రౌడీ అన్న పేరు వింటే ఒక వ్యక్తి గుర్తొస్తాడు. మీకు కూడా గుర్తొచ్చే ఉంటాడు. అవును అతనే. సరే మీకోసం అసలు పేరు కూడా ఒకసారి చెప్పేసుకుందాం. విజయ్ దేవరకొండ. చాలామంది బాలీవుడ్ తారలు కూడా తమకు విజయ్ అంటే చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పారు.

Video Advertisement

అలా దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండ కు క్రేజ్ తీసుకొచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. అప్పటివరకు ఒకలాగా నడిచిన తెలుగు సినిమాల్లో అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమాకి దర్శకత్వం వహించి సాహసం చేశారు సందీప్ రెడ్డి వంగా. అలాంటి సాహసాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు విజయ్ దేవరకొండ.

బహుశా రెండు తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన అందరికీ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ద్వారా పాపులర్ అయి ఉండొచ్చు. కానీ తెలుగు ప్రజలకు అతనిలో ఉన్న నటనా ప్రతిభ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి తెలుసు. ఎవడే సుబ్రహ్మణ్యం ద్వారా మంచి నటుడనిపించుకున్నాడు. అర్జున్ రెడ్డి ద్వారా స్టార్ అయ్యాడు విజయ్.

 

ప్రతి సినిమాకి తన పాపులారిటీ తో పాటు పారితోషకం కూడా పెరిగింది. పెళ్లిచూపులు నుండి ఇప్పటివరకు అంచెలంచెలుగా పైకి ఎదిగిన విజయ్ పారితోషకం ఎంతో ఇప్పుడు చూద్దాం.

#1 పెళ్లి చూపులు – 5 లక్షలు

విజయ్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా పెళ్లిచూపులు. ముందు బడ్జెట్ అసలు సరిపోలేదు అని దాంతో విజయ్ దేవరకొండ బంధువైన యష్ రంగినేని నిర్మాణంలో కొంత పాత్ర పోషించారు అని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఆ సినిమాకి విజయ్ అందుకున్న పారితోషకం ఐదు లక్షలు.

#2 ద్వారక – 20 లక్షలు

పెళ్లి చూపులు సినిమా విజయ్ కి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత ద్వారకా లాంటి కమర్షియల్ సినిమా చేశాడు. దర్శకుడు సినిమా నెరేట్ చేసినప్పుడు ఒకలాగా ఉంది అని తర్వాత షూటింగ్ జరిగేటప్పుడు సినిమా ఇంకొక లాగ వచ్చింది అని. షూటింగ్ సమయంలోనే ఫలితం అర్థమైపోయింది అని కానీ సినిమా ఒప్పుకోవడం తన నిర్ణయమే అని కాబట్టి రిగ్రెట్ చేయడం లేదు విజయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

#3 అర్జున్ రెడ్డి – 5 లక్షలు

ఈ సినిమా పెళ్లిచూపులు తర్వాత మొదలైంది. కానీ షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన టెడ్ టాక్స్ యూట్యూబ్ లో ఉంది. ఆ వీడియో ఒకసారి చూస్తే ఎన్ని కష్టాలతో ఈ సినిమా బయటికి వచ్చిందో మీకే అర్థమవుతుంది.

#4 గీత గోవిందం – 5 లక్షలు

పెళ్లిచూపులు తర్వాత విజయ్ సైన్ చేసిన సినిమా గీత గోవిందం. అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. దాంతో ఐదు లక్షలు పారితోషకం తీసుకున్నాడు విజయ్. ఈ సినిమా ద్వారా విజయ్ తన మొట్టమొదటి కమర్షియల్ మూవీ సక్సెస్ అందుకున్నాడు.

#5 నోటా – 3 కోట్లు

తమిళ్ లో రూపొంది తెలుగులోకి అనువాదం అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

#6 టాక్సీ వాలా – 5 కోట్లు

అనుకున్నంతగా కాకపోయినా ఒక మోస్తరుగా ఆడిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

#7 డియర్ కామ్రేడ్ – 10 కోట్లు

తెలుగులో రూపొంది తమిళ, కన్నడ, మలయాళ, భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడలేదు. కానీ ఎంతోమంది ప్రశంసించారు. దాంతో డియర్ కామ్రేడ్ అండర్ రేటెడ్ సినిమాల జాబితాలో చేరింది.

#8 వరల్డ్ ఫేమస్ లవర్ – 10 కోట్లు

నిజం చెప్పాలంటే కొంతమంది దర్శకులు అర్జున్ రెడ్డి లో విజయ్ దేవరకొండ కోపంగా నటించిన పర్ఫామెన్స్ చూసి కథ రాసారేమో అనిపిస్తుంది. డియర్ కామ్రేడ్ లో కొంచెం అర్జున్ రెడ్డి ఛాయలు ఉంటాయి. అరవడం, రఫ్ గా మాట్లాడడం. అలాంటివి. కానీ సినిమా కథ భిన్నంగానే ఉంది.

కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూస్తే అర్జున్ రెడ్డి సినిమాకి సీక్వెల్ ఏమో అనిపిస్తుంది. సినిమానే కాదు పోస్టర్లు కూడా కొన్ని అలానే అనిపించాయి. ఇప్పటికైనా దర్శకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండకు క్రేజ్ తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ జనాలు విజయ్ ని అభిమానించేది అర్జున్ రెడ్డి సినిమా చేసినందుకు కాదు ఆ సినిమాలో అంత బాగా నటించినందుకు.

అర్జున్ రెడ్డి లాంటి కోపం మీద కంట్రోల్ లేని వ్యక్తిగా విజయ్ ఎంత బాగా నటించాడో. గీత గోవిందం సినిమాలో అమాయకుడైన విజయ్ గోవిందం పాత్రలో కూడా అంతే బాగా నటించాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి క్లాసిక్ తీసిన క్రాంతి మాధవ్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని బహుశా ఎవరూ అనుకోలేదు. ఏదేమైనా విజయ్ మాత్రం తనకు ఇచ్చిన ప్రతి పాత్రకి వంద శాతం న్యాయం చేస్తాడు.

#9 ఫైటర్ – 12 కోట్లు

ఈ సినిమా మీద ప్రేక్షకులందరికీ భారీగా అంచనాలు ఉన్నాయి. విజయ్ కూడా ఈ సినిమా కోసం అంతే ఎక్కువగా కష్టపడుతున్నాడు. పోయిన చోటే తిరిగి తెచ్చుకోవాలి అని అంటారు. నాలుగు భాషల్లో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ ఏ ఒక్క భాషలో కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఫైటర్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతోంది. కాబట్టి ఈ సినిమాతో ఒక్క తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆశిద్దాం.


End of Article

You may also like