మళ్లీ విజయ్ దేవరకొండ ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారా..?

మళ్లీ విజయ్ దేవరకొండ ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారా..?

by Mohana Priya

Ads

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు.

Video Advertisement

షూటింగ్ మధ్యలో ఉండగా ఈ సినిమా ఆపి ఫ్యామిలీ స్టార్ షూటింగ్ చేశారు విజయ్ దేవరకొండ. అయితే జెర్సీ లాంటి మాస్టర్ పీస్ అందించిన దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా ఎలా ఉంటుంది అని ఆసక్తి అందరిలో నెలకొంది. దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టపోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి టైటిల్ ఇంకా ప్రకటించలేదు. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా ఉండబోతోంది. ఇందు కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెడతారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి, విడుదల సమయంలో ప్రమోషన్స్ లో పాల్గొంటారు.


End of Article

You may also like