Home Filmy Adda లైగర్ సినిమాకి “విజయ్ దేవరకొండ” రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

లైగర్ సినిమాకి “విజయ్ దేవరకొండ” రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Mohana Priya

ఈ మధ్య కాలంలో ఒక్క పెద్ద హిట్ తగిలితే చాలు హీరో అయినా హీరోయిన్ అయినా డిమాండ్, ఫ్యాన్స్ బేస్ భారీగా పెరిగిపోతుంది. అంతే కాదు దాంతో పాటు వారు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతుంది. ఈ మధ్య వారు తీసుకునే రెమ్యునరేషన్ బట్టే పెద్ద హీరోనా చిన్న హీరోనా? అనే టాక్స్ కూడా నడుస్తుంటాయి.

అయితే ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఈ నేథ్యంలో సందడి చేస్తున్న లైగర్ మూవీ ప్రమోషన్స్ భారీగా సాగుతున్నాయి. ఇక ఇందులో పలువురు కీలక పాత్రలు పోషించగా, పారితోషికం కూడా భారీగానే పుచ్చుకుంటున్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ కూడా భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట. మరోవైపు కీలక పాత్ర పోషించిన ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా తీసుకున్నారట.

does these things become plus points for vijay devarakonda liger movie

ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్, నూలు పోగు లేకుండా, కేవలం పువ్వులు అడ్డు పెట్టుకున్న పోస్టర్ సంచలనం సృష్టించింది. కొందరు వామ్మో అని షాక్ అయితే, మరి కొందరు దుమ్మెత్తిపోశారు. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారా అంటూ తెగ తిట్టేసారు కొందరు నెటిజన్లు. దీంతో అంతా విజయ్ దేవరకొండ వల్లే మొదలయ్యింది అంటూ విమర్శించారు.

minus points in vijay devarakonda liger trailer

ఇక ఇప్పుడు నడుస్తున్న చర్చల ప్రకారం, సినిమాకోసం విజయ్ దేవరకొండ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని… అందుకే ఇలా చెయ్యడానికి సిద్ధపడి ఉంటాడనీ అన్నారు. మరి నిజంగానే రెమ్యునరేషన్ తీసుకున్నందుకు చేశాడా? లేక ఎందుకో తెలీదు కానీ… ఈ సినిమా కోసం విజయ్ తో పాటు హీరోయిన్ అండ్ ఇతర సిబ్బంది కూడా బాగానే కష్ట పడ్డారు. ఈ సినిమా ప్రెస్ మీట్స్ లో భాగంగా నా ఫ్యాన్స్ ను అలరించడానికి ఎంతో కష్ట పడ్డానని, డ్యాన్సులు కూడా కొత్తగా ట్రై చేశానని విజయ్ చెప్పుకొచ్చాడు.

minus points in vijay devarakonda liger trailer

కాగా ఈ సినిమాకి విజయ్ దేవరకొండ 35 కోట్లు తీసుకుంటే, మైక్ టైసన్ 40 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్ అనన్య పాండే మాత్రం కేవలం 3 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ మూవీ ఆగస్ట్ 25 న ప్యాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మేరకు సినిమా చూశాకే ఆ పోస్టర్ పై స్పష్టత వస్తుంది. అంతే కాకుండా విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కి తగ్గ పెర్ఫార్మెన్స్ ఉంటుందా లేదా అనేది కూడా తెలియనుంది అంటూ, ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

You may also like