Home Filmy Adda లైగర్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో… “విజయ్ దేవరకొండ” చెప్పులు వేసుకోవడం వెనుక ఉన్న కథేంటో తెలుసా..?

లైగర్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో… “విజయ్ దేవరకొండ” చెప్పులు వేసుకోవడం వెనుక ఉన్న కథేంటో తెలుసా..?

by Mohana Priya

అందరితో వావ్ సో హాట్ అనిపించుకుంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులుతో మొదలయ్యి అర్జున్ రెడ్డి వరకూ, అందరినీ అట్రాక్ట్ చేస్తుంటాడు. అమ్మాయిలు అయితే అబ్బా నాకు దొరికితే ఇలాంటి అబ్బాయే కావాలి అని అనుకుంటారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదల కాబోతున్న లైగర్ మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఇందులో అందరినీ బాగా ఆకట్టుకుంటున్న విషయం ఏంటంటే, అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ వేసుకుంటున్న చెప్పులు!!

అందరి కళ్ళు వాటిమీదే.ఈ విషయం గురించి అడిగితే, విజయ్ ఇచ్చిన ఆన్సర్ కి అందరు ఆశ్చర్య పోయారు. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ… నేను లైగర్ సినిమా ప్రమోషన్స్ కి తిరిగాల్సి ఉంటుంది. దాదాపు 30 రోజులు తిరుగుతూనే ఉండాలి. అప్పుడు ప్రతీ రోజు ఒక షూస్ వెతుక్కోవడం, అందంతా పెద్ద తలనొప్పి అనిపించింది.

does these things become plus points for vijay devarakonda liger movie

అందుకే ప్రశాంతంగా, ఈజీగా ఈ స్లిప్పర్స్ వేసుకుని తిరుగుతున్నాను. నిజానికి ఇది నాకు చాలా హాయిగా ఉంది. అయినా నాకు నచ్చినట్టు నేను ఉండటంలో తప్పు లేదు కదా అంటూ సమాధానమిచ్చాడు. దీంతో అభిమానులు కూడా మా హీరో సో స్వీట్ అండ్ సింపుల్. ఎంత బాగుంటాడో అంటూ మురిసిపోతున్నారు. ఇక లైగర్ సినిమాకి పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మాతలు అవ్వగా… పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 25 న 5 భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న లైగర్ మూవీ కోసం అభిమానులు కన్ను కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

You may also like