విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పుష్పక విమానం సినిమా ఇవాళ విడుదల అయ్యింది. 2019 లో వచ్చిన దొరసాని తర్వాత, మళ్లీ థియేటర్లలో విడుదల అయిన ఆనంద్ దేవరకొండ సినిమా ఇది. నటనపరంగా ఆనంద్ దేవరకొండ ముందు సినిమాల కంటే చాలా మెరుగుపడ్డారు. హీరోయిన్లుగా నటించిన గీత్ సైని, శాన్వి మేఘన కూడా బాగా నటించారు. సహాయ పాత్రల్లో నటించిన హర్షవర్ధన్, సునీల్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు దామోదర రాసుకున్న కథ బాగుంది.

Video Advertisement

ఈ సినిమాకి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా విజయ్ దేవరకొండ పాల్గొని సినిమా బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే ఇవాళ సినిమా థియేటర్ స్పందనని కూడా విజయ్ దేవరకొండ షేర్ చేశారు. హిడెన్ కెమెరాల ద్వారా ప్రేక్షకుల స్పందనని రికార్డ్ చేసి ఆ వీడియోని షేర్ చేశారు విజయ్ దేవరకొండ. ఇది చాలు సినిమా రివ్యూ చెప్పడానికి అని అన్నారు.