విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమా గా రూపొందుతోంది.
ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అయితే విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాంకి విజయ్ దేవరకొండతో పాటు రష్మిక కూడా వస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ తర్వాత విజయ్ దేవరకొండతో పాటు రష్మిక ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం లేదు అని అన్నారు. ఆ తర్వాత లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య పాండే, విజయ్ దేవరకొండ కలిసి కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లొచ్చు అని అన్నారు. కానీ అనన్య పాండే కూడా విజయ్ దేవరకొండ తో కలిసి వెళ్ళలేదు.

విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో సైన్ చేసిన కప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కేవలం విజయ్ దేవరకొండ సైన్ ఉన్న కప్ మాత్రమే కనిపిస్తోంది. దాంతో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే ఈ ప్రోగ్రాంకి వెళ్లి ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు.
