Home Filmy Adda Liger : మారుతి బాటలో పూరి జగన్నాధ్.! లైగర్ లో హీరోకి ఆ డిఫెక్ట్.?

Liger : మారుతి బాటలో పూరి జగన్నాధ్.! లైగర్ లో హీరోకి ఆ డిఫెక్ట్.?

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమా గా రూపొందుతోంది.vijay devarakonda to have this problem in liger

ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అది ఏంటంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి నత్తి ఉంటుందట. సాధారణంగా ఇలా హీరోకి డిఫెక్ట్ ఉండడం అనేది మనం దర్శకుడు మారుతి సినిమాల్లో చూస్తుంటాం. పూరి జగన్నాధ్ కూడా అదే బాటని అనుసరిస్తున్నారు అన్నమాట.

puri 2ఏదేమైనా సినిమా బృందంలోకి ప్రపంచంలో పేరున్న బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్ యాడ్ అవ్వడం, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ కి సంబంధించిన స్టిల్స్, అవన్నీ కూడా సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచుతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన లైగర్ సినిమా వాయిదా పడి అక్టోబర్ లో విడుదల అవుతుంది అని సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

You may also like