Home Filmy Adda పెళ్ళైన 13 రోజులకే అలా చేసేవాడు…విజయ్ చనిపోయాక అసలు ఏం జరిగిందో చెప్పిన కమెడియన్ భార్య.!

పెళ్ళైన 13 రోజులకే అలా చేసేవాడు…విజయ్ చనిపోయాక అసలు ఏం జరిగిందో చెప్పిన కమెడియన్ భార్య.!

by Mohana Priya

అమ్మాయిలు అబ్బాయిలు వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి ఫేమస్ అయిన నటుడు విజయ్ సాయి. తర్వాత చాలా సినిమాల్లో విజయ్ సాయి నటించారు. కొంత కాలం క్రితం విజయ్ సాయి బలవన్మరణానికి పాల్పడినట్టు వార్త వచ్చింది. అప్పటి వరకు విజయ్ సాయి వ్యక్తిగత జీవితం అనేది ఎవరికీ పెద్దగా తెలియదు. ప్రోగ్రామ్స్ లో కనిపించినప్పుడు కూడా సరదాగా ఉండేవారు. కానీ అప్పటి నుండి విజయ్ జీవితానికి సంబంధించిన విషయాలు బయటకు రావడం మొదలు అయ్యాయి. విజయ్ కి 2008 లో వనిత అనే ఒక నటితో పెళ్లి జరిగింది.

vijay sai wife vanitha reddy about his behavior

వీరిద్దరూ ఒక సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించుకొని, కొన్ని నెలల గ్యాప్ తోనే పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు బానే సాగిన వీళ్ళ కాపురంలో తర్వాత సమస్యలు జరిగి, ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. అయితే, ఇప్పుడు వనిత కొంత కాలం క్రితం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి మాట్లాడారు. ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా కూడా బయటికి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు అని చెప్పారు. 2008 నుండి 2012 వరకు వాళ్ళ కాపురం బాగానే సాగింది అని అన్నారు. మధ్య మధ్యలో కొన్ని గొడవలు అయ్యాయి అని అన్నారు.

vijay sai wife vanitha reddy about his behavior

పెళ్లి అయిన 13 రోజుల తర్వాత మొదటిసారిగా విజయ్ తనని కొట్టారు అని వనిత చెప్పారు. డెలివరీ సమయం వరకు వనిత తల్లిదండ్రులు తనతో మాట్లాడలేదు అని, పాప డెలివరీ అయినప్పుడు వనితని చూడటానికి మొదటిసారి హాస్పిటల్ కి వనిత తల్లి వచ్చారు అని చెప్పారు. విజయ్ సాయి బంధువులు అతని గురించి చెప్పి ముందే హెచ్చరించారట. అయినా కూడా వనిత వినకుండా, విజయ్ సాయిని మార్చుకుంటాను అని గట్టిగా చెప్పి పెళ్లి చేసుకున్నారట. అలా చెప్పిన కారణంగానే మధ్యలో కొట్టినా కూడా అదే నమ్మకంతో ఉన్నారట.

vijay sai wife vanitha reddy about his behavior

జూన్, జూలై సమయంలో వారిద్దరి పరిచయం ఏర్పడింది అని, తర్వాత ఆగస్ట్ సమయంలోనే వాళ్ళ పెళ్లి జరిగింది అని. అంటే ప్రేమకి, పెళ్ళికి మధ్యలో ఎక్కువ సమయం లేదు అని అన్నారు. సమయం తీసుకొని ఉంటే ఇంకా కొంచెం స్పష్టత వచ్చేది అని, చిన్న వయసు కావడంతో ఆ ఆకర్షణని ప్రేమ అని అనుకున్నారు అని అన్నారు. ఇంకా చాలా విషయాల గురించి వనిత ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

watch video :

ALSO READ : చీరకట్టులో ఎయిర్ పోర్ట్ కి వచ్చినందుకు ఆ మహిళ ఎగతాళి చేసింది…సుధామూర్తి గారి కౌంటర్ హైలైట్.!

You may also like