Ads
- చిత్రం : వారసుడు
- నటీనటులు : విజయ్, రష్మిక మందన్న, ఆర్ శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ.
- నిర్మాత : దిల్ రాజు, శిరీష్ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
- దర్శకత్వం : వంశీ పైడిపల్లి
- సంగీతం : తమన్
- విడుదల తేదీ : జనవరి 14, 2023
Video Advertisement
స్టోరీ :
రాజేంద్ర శరత్ కుమార్ మైనింగ్ రంగంలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఒక వ్యాపారవేత్త. రాజేంద్రకి ముగ్గురు కొడుకులు ఉంటారు. వారు జై (శ్రీకాంత్), అజయ్ (శామ్), విజయ్ (విజయ్). మొదటి ఇద్దరు కొడుకులు రాజేంద్ర వ్యాపారాన్ని చూసుకుంటారు. కానీ విజయ్ మాత్రం రాజేంద్రకి పూర్తి విరుద్ధంగా ఉంటాడు. ఈ క్రమంలో రాజేంద్ర భార్య సుధ (జయసుధ) ఇంట్లో ఒక షష్టిపూర్తి నిర్వహిస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. అప్పుడు విజయ్ కూడా వస్తాడు. కానీ అక్కడ జరిగే సంఘటనలు తెలుస్తాయి. దాంతో రాజేంద్ర తర్వాత విజయ్ వ్యాపార బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత జరిగిన సమస్యలు ఏంటి? వాటిని విజయ్ ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
డైరెక్ట్ తెలుగు సినిమాల ద్వారా కాకపోయినా తమిళ్ డబ్బింగ్ సినిమాల ద్వారా దాదాపు ఒక తెలుగు స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్. తుపాకి సినిమా నుండి ఇప్పటివరకు కూడా విజయ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి దాదాపు తమిళ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అవుతాయి. అయితే విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు అంటే ఈ సినిమా తెలుగులో కూడా ఉంటుంది ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా పక్కా తమిళ్ సినిమా. తెలుగులోకి డబ్ చేశారు.
సినిమా ట్రైలర్ లో చూసినట్టే ఇందులో చాలా సినిమాల స్టోరీలు కలిపి ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడా మనకి కొత్తగా అనిపించదు. అందుకు కారణం ఇలాంటి సినిమాలు తెలుగులో ఒకటి కాదు. చాలా వచ్చాయి. అది మాత్రమే కాకుండా ఇందులో ముఖ్య పాత్రలు పోషించిన నటీనటులు కూడా అంతకుముందు చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రలే పోషించారు. దాంతో కొత్తదనం లోపించినట్టు అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
కానీ సినిమా మొత్తాన్ని మాత్రం నడిపించింది విజయ్. నిజంగా ఒక స్టార్ పవర్ అంటే ఏంటో ఈ సినిమా ద్వారా నిరూపించబడింది. సినిమాలో కొత్తదనం లేకపోయినా కూడా ప్రేక్షకులు సినిమా చూసే అంత ఆసక్తికరంగానే కనిపించింది అంటే అందుకు కారణం డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే అలాగే తెరపై నటీనటుల పెర్ఫార్మెన్స్. తమన్ ఇచ్చిన పాటలు కూడా వినడానికి మాత్రమే కాకుండా చూడడానికి బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని పాటల్లో విజయ్ డాన్స్ అయితే ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్:
- విజయ్
- పాటలు
- సినిమాటోగ్రఫీ
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- పాత కథ
- ఎక్కడో చూసాం అనిపించినట్టు ఉండే సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్:
సినిమా నుండి కొత్తదనం ఏమి ఆశించకుండా, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలి అనుకునే వారికి, అలాగే విజయ్ నుండి మంచి ఎలివేషన్ ఉన్న సినిమా చూడాలి అనుకునే వారికి ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఎమోషనల్ డ్రామాల్లో ఒకటిగా వారసుడు సినిమా నిలుస్తుంది.
watch trailer :
End of Article