Ads
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో దొంగలు జనాలకు టోపీ వేయడం కోసం కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు.వీటిని చిత్తు చేయడానికి పోలీసులు తమ విభాగాలను పెంచుకుంటున్నారు.అయినప్పటికీ ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్న ప్రజల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.సైబర్ మోసాలకు గురైన ప్రజలు తమ డబ్బులు తిరిగిరావని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి ప్రజలెవ్వరూ ముందుకు రావట్లేదు.
Video Advertisement
వీటిని అరికట్టడానికి పోలీసులు అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దాని ఫలితంగా ఈమధ్య సైబర్ కేసులలో మోసపోయిన వాళ్ళ కేసులు నమోదు చేస్తున్నారు.ఇక తాజాగా ఇలా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఓ మహిళ కేసు నమోదు చేశారు.వెంటనే ఆమెకు పోలీసులు న్యాయం చేశారు.
ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.ఆంధ్రప్రదేశ్ విజయవాడ కొత్తపేటకు చెందిన ఓ మహిళ ఈ నెల 23న తన స్నేహితురాలికి గూగుల్ పే ద్వారా 5వేలు పంపించింది.ఆ డబ్బులు తన స్నేహితురాలికి వెళ్ళలేదు కాని తన బ్యాంక్ అకౌంట్ లో కట్ అయ్యాయి.
దీంతో ఆ డబ్బులు ఒకట్రెండు రోజుల్లో డబ్బులు తిరిగి వచ్చేస్తాయని వెయిట్ చేసింది కాని వారం రోజులైనా డబ్బులు తిరిగి రాలేదు.దానితో ఆమె గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్ సెర్స్ చేసి ఆ నంబర్‌కు ఫోన్ చేసింది. అవతలి వ్యక్తి సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగి ఉంటుందని దాన్ని సాల్వ్ చేయడానికి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఓటీపీ కావాలని ఆమెను నమ్మించి కావల్సిన సమాచారం తీసుకున్నాడు.
కొద్దిసేపటికే ఆమె అకౌంట్ నుంచి 48,761 రూపాయిలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది.దీనితో వెంటనే బాధితురాలు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు.ఆమె అకౌంట్ నుండి ఏ అకౌంట్ కు నగదు ట్రాన్స్‌ఫర్ అయిందో తెలుసుకొని బ్యాంక్ అధికారులను సంప్రదించి తిరిగి బాధితురాలి అకౌంట్ లోకి నగదు జమ చేస్తారు కాబట్టి. గంటల వ్యవధిలో ఈ తతంగమంతా పూర్తయింది.బాధితురాలికి క్షణాలలో మాయమైన డబ్బును తిరిగి వచ్చేలా చేసిన పోలీసులపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తుంది.
End of Article