విజయవాడలో ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గ ఆలయానికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు వచ్చి, దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. కేవలం విజయవాడ చుట్టుపక్కల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి  భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

Video Advertisement

దుర్గమ్మకు వివిధ రూపాలలో తమ మొక్కులను చెల్లిస్తుంటారు. కొందరు భక్తులు దుర్గమ్మకు చీరలు సమర్పిస్తే, కొందరు రవికలు సమర్పిస్తారు. భక్తులకు కావాల్సిన చీరలు మరియు రవికలను గుడి పరిసరాలలో ఉండే దుకాణాలలో కొనుగోలు చేస్తారు. అయితే రవికల పేరుతో గుడ్డ పీలికలను ఇస్తున్నారని ఒక భక్తురాలు ఆరోపించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సమయం కథనం ప్రకారం అమ్మవారి దర్శనం కోసం హైదరాబాద్ నుండి ఎం హారిక దంపతులు శనివారం నాడు ఇంద్రకీలాద్రికి వచ్చారు. దుర్గమ్మకు సమర్పించడం కోసం రవికను కొనుగోలు చేయడం కోసం మహా మండపం 5 వ అంతస్తులో ఉన్న  షాపుకు వెళ్లి వంద రూపాయలు చెల్లించి, రవికను కొన్నారు. పది రూపాయలు చెల్లించి కుంకుమ, పసుపు ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న తరువాత దేవస్థానం యొక్క  కౌంటర్‌లో తాము కొన్న రవికను సమర్పించారు.
కానీ దేవస్థాన కౌంటర్‌ సిబ్బంది ఆ రవికను చెత్తలో వేయమని చెప్పడంతో వారు షాకయ్యారు. సందేహం వచ్చి, రవిక ను పరిశీలించగా అది రవిక కాదని, దాన్ని రుమాలు అనికూడా చెప్పలేము అని హారిక తెలిపారు. అమ్మవారి రవికల పేరుతో గుడ్డ ముక్కలను అందంగా ఉండే ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారని హారిక ఆరోపించారు.అడిగినంత డబ్బు ఇస్తున్నా కూడా, గుడి అవరణలోనే భక్తులను మోసం చేయడం ఏంటని కౌంటర్‌ లో ఉన్న  సిబ్బందిని నిలదీయగా వారు ఆలయ అధికారులకు కంప్లైంట్ చేయమని సూచించినట్లుగా ఆమె తెలిపారు. అక్కడ ఇదంతా సాధారణంగా జరిగే విషయమే అని ఆలయ అధికారి చెప్పారని అన్నారు. దాంతో దేవాలయ ఈవో భ్రమరాంబను కలవడానికి ప్రయత్నించగా, ఆ టైమ్ లో ఈవో అందుబాటులో లేకపోవడంతో వెనక్కు వచ్చామని హారిక వెల్లడించారు.

Also Read: తిరుమల దారిలో తరచుగా పులుల దాడులు ఎందుకు జరుగుతున్నాయి..? కారణం ఇదేనా..?