Home Filmy Adda ఆ విషయంలో రాజమౌళికి చెప్పి చెప్పి విసుగొచ్చింది..! అంటూ విజయేంద్ర ప్రసాద్ గారి షాకింగ్ కామెంట్స్.!

ఆ విషయంలో రాజమౌళికి చెప్పి చెప్పి విసుగొచ్చింది..! అంటూ విజయేంద్ర ప్రసాద్ గారి షాకింగ్ కామెంట్స్.!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.vijayendra prasad about rajamouli

కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన విషయాల గురించి చెప్పారు. అంతే కాకుండా రాజమౌళి తో పాటు మిగిలిన తోటి దర్శకులలో కూడా ఎవరు అంటే ఇష్టం, అలాగే ఎవరెవరిలో ఏ క్వాలిటీ నచ్చుతుంది, అని కూడా చెప్పారు. త్రివిక్రమ్ సెన్సాఫ్ హ్యూమర్ అంటే ఇష్టమని చెప్పారు.vijayendra prasad about rajamouli

సుకుమార్, రాజమౌళి ఒకటే అని చెప్పారు. చాలా స్లో అని అన్నారు. ఇద్దరికీ పరుగు పందెం పెడితే ఎవరు నెగ్గుతారో తెలియదు అని అన్నారు. ఇద్దరూ వారి వృత్తికి చాలా కమిటెడ్ గా ఉంటారు అని అన్నారు. పూరి జగన్నాథ్ అయితే సూపర్ ఎక్స్ప్రెస్ అని అన్నారు.vijayendra prasad about rajamouli

అయితే యాంకర్ “మీరు ఎప్పుడైనా రాజమౌళి గారికి మరి స్లో గా వెళ్తున్నారు. కొంచెం తొందరగా చేయమని చెప్తారా ?” అని అడగగా, అందుకు విజయేంద్ర ప్రసాద్ గారు “చెప్పి చెప్పి విసుగొచ్చింది” అని అన్నారు. అలాగే ఇంటర్వ్యూ లో విజయేంద్ర ప్రసాద్ గారు రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు.

watch video :

You may also like