తన ప్రాణాలు పనులుగా పెట్టి విజయశాంతి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో….

తన ప్రాణాలు పనులుగా పెట్టి విజయశాంతి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో….

by Mounika Singaluri

Ads

కెప్టెన్ విజయ్ కాంత్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే… ఆయన రియల్ లైఫ్ లో హీరో ఇజం చూపించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ ద్వారానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు విజయ్ కాంత్. అందుకే ఇప్పుడు ఆయన లేరు అని వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Video Advertisement

అయితే ఒక సందర్భంలో తన ప్రాణాలను అడ్డేసి విజయశాంతి ప్రాణాలను విజయశాంతి కాపాడారు. తనను కాపాడిన కెప్టెన్ గొప్పతనాన్ని మరో సారి గుర్తు చేసుకున్నారు ఈమె. “1980లో ఓ సినిమా షూటింగ్‌లో నన్ను ఓ తోటలో కట్టేసి, చుట్టూ మంట అంటించారు. గాలికి ఆ ప్రాంతమంతా అంటుకుంది. నా చేతులు కట్టేయడంతో తప్పించుకోలేని పరిస్థితి.

ఆ సమయంలో విజయ్‌కాంత్ గారు ఎంతో కష్టపడి కట్లు విప్పి నన్ను కాపాడారు. ఆయన ఎప్పటికీ ప్రజల హీరో” అని విజయ్‌ శాంతి కెప్టెన్ విజయ్‌ కాంత్ గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక విజయ్‌ కాంత్ మరణంపై కోలీవుడ్ సెలబ్రిటీలే కాదు.. టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా.. రియాక్టవుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూనే ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరకుంటున్నారు. విజయశాంతి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు విజయ్ కాంత్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆయన ఎలాంటి హీరో మరొకరు ఉండరంటూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like