చనిపోయిన భర్త కలకాలం గుర్తుండాలని .. విజయ్ కాంత్ భార్య చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!

చనిపోయిన భర్త కలకాలం గుర్తుండాలని .. విజయ్ కాంత్ భార్య చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!

by Mounika Singaluri

నటుడు డి ఎం డి కె అధినేత విజయ్ కాంత్ డిసెంబర్ 28న కన్ను మూశారు. ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు అయితే ఆయనకు కరోనా కూడా సోకటంతో వెంటి లేటర్ పై ఉంచి చికిత్స అందించారు.

Video Advertisement

అయితే మరణంతో పోరాడిన విజయకాంత్ చివరికి చావు చేతిలో ఓడిపోక తప్పలేదు. అయితే ఈయన మరణం కోలీవుడ్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ వచ్చారు. ఇప్పటికకీ ఈయన సమాధి వద్దకు వందలాది మంది అభిమానులు వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఈ విషాద సంఘటన నుంచి విజయ్ కాంత్ కుటుంబం ఇంకా బయటపడలేదనే చెప్పాలి.

ఈ క్రమంలో విజయకాంత్ పట్ల తన భార్య ప్రేమలత తనకు ఉన్నటువంటి ప్రేమని మరొకసారి బయటపెట్టారు. తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఈమె తన భర్త ప్రేమకు గుర్తుగా తన చేతిపై తన భర్త ఫోటోని టాటూగా వేయించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భర్తను మర్చిపోలేక ఈమె ఇలా టాటూ వేయించుకున్నారని తెలుస్తుంది ఇక విజయకాంత్, ప్రేమలత వివాహం 1990 సంవత్సరంలో జరిగింది.

వీరికి ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు షణ్ముఖ పాండియన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 90 లలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకటిగా విజయ్ కాంత్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా విజయ్ కాంత్ తెలుగు వాళ్ళకి కూడా పరిచయమే. అయితే తర్వాత కాలంలో రాజకీయాలలో ప్రవేశించిన విజయ్ కాంత్ అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయాడు.

https://www.instagram.com/reel/C27INCFP8Fo/?utm_source=ig_embed&ig_rid=2d58d77d-73f2-4475-b48a-b64b81051d0c


You may also like

Leave a Comment