“అక్కడకి రాలేం.. ఇక్కడ ఉండలేం..” విజయవాడ అమ్మాయి కన్నీళ్లు.. వైరల్ అవుతున్న వీడియో..!

“అక్కడకి రాలేం.. ఇక్కడ ఉండలేం..” విజయవాడ అమ్మాయి కన్నీళ్లు.. వైరల్ అవుతున్న వీడియో..!

by Megha Varna

Ads

ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుండి కూడా ఉక్రెయిన్ లో రష్యా దాడులు జరుగుతున్నాయి. ఇది మూడవ రోజు. అయితే అక్కడ నుంచి స్వదేశానికి రావాలని భారతీయులు చూస్తున్నారు. మొత్తం 19 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Video Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న విజయవాడ విద్యార్థిని ఒక వీడియోని రికార్డ్ చేసి పంపించారు. ఆమె పేరు విహారి. ఉక్రెయిన్ లో ఆమె మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.

అయితే వాళ్లకు ఎటువంటి సహాయం కూడా అందడం లేదని విహారి చెబుతున్నారు. పైగా అక్కడ పరిస్థితి బాగోలేదని.. దాడులు జరుగుతున్నాయని ఆమె ఈ వీడియో ద్వారా వివరించారు. ఇండియన్ ఎంబసీ వాళ్లకు రక్షణ కల్పించాలని సహాయం చేయాలని కోరుతున్నారు.

అలానే వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న చోటు నుండి బోర్డర్ కి వెళ్లాలంటే పదిహేను గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇండియన్ ఎంబసీ బోర్డర్ కి వెళ్లడానికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ని కల్పించడం లేదని విహారి చెప్పారు.

మీరే స్వయంగా బోర్డర్ కి రీచ్ అవ్వాలని అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటామని ఇండియా ఎంబసీ చెబుతున్నట్లు ఆమె చెప్పారు. చాలా మంది భారతీయులు అక్కడ ఇరుక్కుపోయారని ఆమె తెలిపారు. వాళ్లు ఉంటున్న దగ్గర నుండి బోర్డర్ కి రీచ్ అవ్వడానికి ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.


End of Article

You may also like