Ads
ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ లేదా స్టోరీ రైటర్ కి మరొక డైరెక్టర్ ఇష్టం ఉండడం చాలా సహజం. అలా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా ఒక డైరెక్టర్ అంటే చాలా ఇష్టం. ఈ మాట వినగానే మనలో చాలా మందికి ఆ వ్యక్తి రాజమౌళి ఏమో అని అనిపిస్తుంది. కానీ కాదు. విజయేంద్ర ప్రసాద్ గారికి పూరి జగన్నాధ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఇటీవల ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో కూడా చెప్పారు. అంతే కాకుండా తన మొబైల్ వాల్ పేపర్ కూడా పూరి జగన్నాథ్ ఫోటో ఉంటుంది.
Video Advertisement
అయితే తనకి పూరి జగన్నాథ్ అంటే ఎందుకు అంత ఇష్టమో విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయంపై విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, “పూరి జగన్నాథ్ చాలా చిన్న పాయింట్ తీసుకుంటారు. ఆయన ఫైట్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా సరే, ఎదుటి వాడిని కొట్టాలి అని మనకనిపించాలి. అప్పుడే ఫైట్ బాగుంటుంది. అలా పూరి జగన్నాథ్ చిటికెలో కోపం రప్పిస్తారు. ఆ టెక్నిక్ నాకు దొరకడం లేదు. ఆయన దగ్గర ఒక సినిమా చేస్తే సీక్రెట్ ఈ టెక్నిక్ పట్టుపడుతుందేమో” అని అన్నారు.
watch video :
End of Article