Ads
ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2 వంటి పలు చిత్రాల్లో నటించింది విమలారామన్. తర్వాత కొన్ని కన్నడ సినిమాల్లో నటించింది. చివరిగా శర్వానంద్, అల్లరి నరేష్ నటించిన నువ్వా నేనా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. తర్వాత ఇంక వేరే సినిమాలో కనిపించలేదు.
Video Advertisement
మళ్లీ కొంత విరామం తర్వాత ఓం నమో వెంకటేశాయ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసింది.తర్వాత ఒక తమిళ సినిమాలో నటించింది. విమలారామన్ మంచి నటి అవ్వడంతో పాటు క్లాసికల్ డాన్సర్ కూడా. మొదటి నుండి కూడా ఏ సినిమా వస్తే ఆ సినిమా చేయకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వచ్చింది.
తను చేసిన సినిమాలో తన పాత్ర హీరోయిన్ పాత్రా లేక సహాయ పాత్రా అని ఏమీ ఆలోచించదు. పాత్ర ముఖ్యమైనది అయితే చాలు అనుకుంటుంది. అందుకే చేసింది కొన్ని సినిమాలే అయినా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అందుకే అంత ప్రతిభ ఉన్నా కూడా ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయలేదు.
ఇవి విమలారామన్ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫోటోలు. తనే నా కాదా అని గుర్తుపట్టలేనంత స్టైలిష్ గా మారిపోయింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తన మేకోవర్ చూసి ఆశ్చర్య పోవడమే కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం విమలారామన్ పబ్ గోవా అనే తమిళ సినిమాలో నటిస్తోంది.
End of Article