ఒకటే రోజు పుట్టారు… ఒకటే రోజు చనిపోయారు..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

ఒకటే రోజు పుట్టారు… ఒకటే రోజు చనిపోయారు..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

by Mohana Priya

Ads

ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ కోసం ఒక జంట వెళ్లారు. వీరి పేర్లు వినాయక్ ముంగురవాడి, సుజాత ముంగురవాడి. 1994 లో హుబ్బళిలో బీవీబీ కాలేజ్ లో కలిసి చదువుకున్నారు. ఇద్దరు పుట్టినరోజు ఒకటే రోజు. ఇద్దరూ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వినాయక్, స్నేహలోక అనే ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించి, దాని ద్వారా 16 సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వినాయక్ ట్రెక్కింగ్ కి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం తన భార్యతో కలిసి ట్రెక్కింగ్ కి వెళ్ళాలి అని అనుకున్నారు.

Video Advertisement

vinayak sujatha incident.

హిమాలయ పర్వతాల్లో సహస్త్రతాల్ అనే యొక్క సరస్సులో ఏడు సరస్సులు ఉన్నాయి. అక్కడి నుండి పాండవులు స్వర్గానికి వెళ్లారు అనే విషయాన్ని పురాణాల్లో చెప్తూ ఉంటారు. గత నెల 29వ తేదీన 22 మంది కలిసి ట్రెక్కింగ్ కోసం హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ నుండి సహస్త్రతాల్ సరస్సు దగ్గరికి వెళ్లారు. ఆ ఏజెన్సీ వారిని అక్కడికి పంపించింది. ఇందులో 18 మంది కర్ణాటక కి చెందినవారు. వారితో పాటు ముగ్గురు లోకల్ గైడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ట్రెక్కింగ్ కి వెళ్లారు. శుక్రవారం నాడు ట్రెక్కింగ్ పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం అవుతుంటే వాతావరణం చల్లగా మారిపోయింది.

మంచు తుఫాన్, చలి గాలులు రావడం మొదలు అయ్యాయి. అందులో వాళ్ళు చిక్కుకుపోయారు. సమయానికి వారు బేస్ క్యాంప్ కి చేరుకోలేకపోయారు. దాంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ వారు అధికారులకి సమాచారం ఇచ్చారు. అక్కడ ప్రభుత్వం వారు తమ సైన్యం, హెలికాప్టర్లను పంపించి సహాయక చర్యలు చేశారు. అక్కడ జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళందరిని ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడి తీసుకొచ్చారు. చనిపోయిన వారిలో వినాయక్, సుజాత ఉన్నారు. వీరిద్దరూ పుట్టినరోజు మాత్రమే కాదు. చనిపోయిన రోజు కూడా ఒకటే. ఈ వార్త తెలుసుకున్న వాళ్ళందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.


End of Article

You may also like