Ads
చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పైగా చాలా మంది ఏదైనా తినేటప్పుడు వాళ్ళు దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఆ విధంగా అది ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ ఒక యువతి కూడా అలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. ఒక కచోరి షాప్ దగ్గరికి వెళ్లి తియ్యగా, పుల్లగా, కారంగా ఉండే ఒక కచోరిని కొనుక్కుంది. అయితే అందులో ఉల్లిపాయ ముక్కలు లేవు.
Video Advertisement
ఆమె ఉల్లిపాయలు కావాలని బండి అతన్ని అడిగింది. దీనితో వెంటనే వ్యాపారి ఉల్లిపాయలు లేవు అని చెప్పాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు.
పైగా అతనితో వాదనకి దిగింది. ఉల్లిపాయలు లేవని కచోరి ఇచ్చే ముందే చెప్పాలి కదా అంటూ ప్రశ్నించింది. ఇప్పుడు ఏం చేయాలి వెళ్లి ఉల్లిపాయముక్కలు తీసుకు రావాలా అని అడిగాడు వ్యాపారి. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.ఇంతలో ఆ యువతికి కోపం తన్నుకొచ్చింది. వెంటనే కాలితో వ్యాపారి బండిని తన్నింది. దీంతో బండి కింద పడిపోయింది. కచోరీలు సైతం మొత్తం అన్ని కూడా కింద పడిపోయాయి.
అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు కోసం ఇలా చేస్తారా అంటూ ఆ యువతి పై మండిపడ్డారు. బండిని కింద పడినందుకు వ్యాపారి పరిహారం చెల్లించమని అడిగాడు. ఆ వ్యాపారిని రెండు సార్లు ఆమె చెంప మీద మెల్లగా కొట్టింది ఆమె.
పైగా అక్కడ ఒక వ్యక్తి వీడియో షూట్ చేస్తూంటే అతనిపై కూడా మండిపడింది. వీడియో కనుక క్లోజ్ చేయకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికి 3.8 లక్షల మంది దానిని చూశారు. చూసిన వాళ్ళు ఇంత చిన్న విషయానికి అంత గొడవా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Wo stree hai kuch bhi kar sakti hai pic.twitter.com/IyLB45sZzk
— Sarcastic Caravan 🎭 (@Saffron_Smoke) November 7, 2021
End of Article