Home Filmy Adda ఈవెంట్ లో చైతుతో అమ్మాయి…వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న ఈమె ఎవరో తెలుసా.?

ఈవెంట్ లో చైతుతో అమ్మాయి…వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న ఈమె ఎవరో తెలుసా.?

by Mohana Priya

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

తాజాగా.. ఈ సినిమాకు “బంగార్రాజు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి నటించనున్నారు.

video of naga chaitanya smiling at daksha nagarkar in bangarraju event goes viral

న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ విడుదల చేసారు. ఈ సినిమా సంక్రాంతి కనుకగా విడుదల అవ్వబోతోంది. టీజర్‌లో నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, క్రితి శెట్టి కనిపించారు. వీరు మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న మరి కొంత మంది నటులు కూడా ఇందులో కనిపించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నాగ చైతన్య స్టేజ్ మీద ఉన్నారు నిల్చోని ఉన్నారు. అలాగే చుట్టూ సినిమాకి సంబంధంచిన వాళ్ళు కూడా నిల్చోని ఉన్నారు.

actress in bangarraju teaser

నాగ చైతన్య వెనక్కి తిరిగి చూసినప్పుడు, అక్కడే స్టేజ్ మీద ఉన్న దక్ష నాగర్కర్ ని చూసి నవ్వారు. దాంతో దక్ష నాగర్కర్ కూడా నవ్వారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్ష బంగార్రాజు సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించారు. దక్ష అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించారు. హుషారు సినిమాలో కూడా ఒక హీరోయిన్‌గా నటించారు. 2013లో వచ్చిన “ఇష్ట సఖి” సినిమాతో దక్ష ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత “ఏకే రావు”, అలాగే తేజ దర్శకత్వంలో వచ్చిన “హోరా హోరీ” సినిమాల్లో నటించారు. ఇటీవల విడుదలయిన “జాంబీ రెడ్డి”లో కూడా దక్ష నటించారు.  బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది.

watch video :

#1

https://www.instagram.com/tv/CYiSxJLvZp4/?utm_source=ig_web_copy_link

#2

 

https://www.instagram.com/tv/CYiVGmWjMVI/?utm_source=ig_web_copy_link

#3

https://www.instagram.com/reel/CYijYHgp7Ow/?utm_source=ig_web_copy_link

#4

https://www.instagram.com/tv/CYisrI1qbj7/?utm_source=ig_web_copy_link

 

You may also like