వైరల్ వీడియో: పెళ్లికూతురు ముందే పెళ్ళికొడుకు కౌగిలించుకున్న అమ్మాయి…చివరికి అసలు ట్విస్ట్.?

వైరల్ వీడియో: పెళ్లికూతురు ముందే పెళ్ళికొడుకు కౌగిలించుకున్న అమ్మాయి…చివరికి అసలు ట్విస్ట్.?

by Megha Varna

Ads

భర్త ఏ స్త్రీ ని చూసినా, భర్త వైపు ఎవరైనా చూసినా భర్త పని అయిపోయినట్లే. ప్రతి స్త్రీ కూడా తన భర్త తనకి మాత్రమే సొంతం అని అనుకుంటుంది. ఒక స్త్రీ తో నవ్వుతూ మాట్లాడినా సరే భార్య జీర్ణించుకోలేదు. పొరపాటున భార్య కంటికి ఇటువంటివి కనబడితే ఇక మటాష్ అయ్యిపోతాడు ఆ భర్త. అలాంటిది ఏకంగా భర్తనే కౌగలించుకుంటే ఇంక పరిస్థితి ఎలా ఉంటుంది..? ఒకసారి మీరే ఊహించుకోండి. మాటతోనే సహించలేని భార్య ఏకంగా కౌగిలింతని చూసిందంటే ఏమౌతుంది..? తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదురయింది ఒక భర్తకి.

Video Advertisement

ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కానీ దీనిలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అది చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు. అసలు ఏమైంది..?, ఈ వీడియోలో ఏముంది అనే విషయంలోకి వెళితే.. వివాహమయ్యాక వధూవరులు ఇద్దరూ కూడా స్టేజ్ మీద నించున్నారు. వచ్చిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి ఎక్కి వధూవరులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలానే తెచ్చిన బహుమతులు అందిస్తున్నారు.

ఈ క్రమంలో ఒక మహిళ బురఖా వేసుకుని స్టేజ్ పైకి వచ్చింది. పెళ్లి కూతురికి ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత వరుడికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా హాగ్ చేసుకోవడం మొదలు పెట్టింది. అసలు ఎంతకీ వదల్లేదు కాసేపటి వరకు అలా గట్టిగా పట్టేసుకుంది. ఇది చూసి పెళ్ళికూతురుకి మతి పోయింది. ఏం చేయాలో అర్థం కాక దీనంగా చూస్తోంది పెళ్లికూతురు. అంతా అనుకున్నారు ఆ వరుడు పనైపోయిందని. కానీ ఇక్కడే ఉంది ఒక ట్విస్ట్.

అదేంటంటే వరుడుని కౌగిలించుకున్న ఆమె బురఖా ని తొలగించింది. అప్పుడు తెలిసింది ఆమె మహిళా కాదని కేవలం ప్రాంక్ చేయడానికి వరుడు స్నేహితుడు అలా వచ్చాడని అర్థమయింది. ఇది చూసి పెళ్ళికూతురు ఊపిరిపీల్చుకుంది. పెళ్లి వేదిక అంతా కూడా ఒక్కసారిగా బురఖా ని తొలగించే సరికి ఎంతో సందడిగా మారిపోయింది. పెళ్లి వేదిక లో ఉన్న కొందరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది చూసి నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

watch video:

https://www.instagram.com/reel/CYV9gaLpMKL/


End of Article

You may also like