Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ నడుస్తోంది. అదే విరాట్ కోహ్లీ, ఇంకా అనుష్క శర్మ నిన్న చేసిన ఎనౌన్స్మెంట్. ఆగస్టు 27 వ తేదీన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తల్లిదండ్రులు కాబోతునట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నెటిజన్లు అందరూ వాళ్ళిద్దరికీ అభినందనలు తెలుపుతున్నారు. దాంతో నిన్నటి నుండి ఈ ఎనౌన్స్మెంట్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
Video Advertisement
కొంతకాలం క్రితం హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిక్ కూడా తల్లిదండ్రులు అయిన విషయం అందరికి తెలిసిందే. విషయం ఏంటంటే. ఈ వార్తలు ఎనౌన్స్ చేసినప్పుడు అనుష్క శర్మ, నటాషా స్టాంకోవిక్ ఒకటే రకం డిజైన్ ఉన్న డ్రెస్ ధరించారు.
ఇది కోఇన్సిడెన్స్ అయినా కూడా సోషల్ మీడియా లో కొన్ని పేజెస్ సరదాగా ఈ విషయాన్ని పోస్ట్ చేశాయి. అంతేకాకుండా గత సంవత్సరం తైమూర్ అలీ ఖాన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో కరీనా కపూర్ కూడా ఇలాంటి డ్రెస్సే ధరించారు. కొద్ది రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు.
దాంతో ప్రస్తుతం ఈ డ్రెస్ కూడా వైరల్ అయ్యింది. అంతేకాకుండా సోషల్ మీడియా లో కొన్ని మీమ్ పేజెస్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఎనౌన్స్ చేసిన ఈ విషయంపై ఎన్నో మీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు.
End of Article