Ads
మనదేశం నుండి వేరే దేశానికి వెళ్లాలంటే ముందుగానే వీసా తీసుకోవాల్సి ఉంటుంది, అమెరికా, బ్రిటన్,ఆస్ట్రేలియా, యూరప్, లాంటి దేశాలకి వెళ్లాలంటే ఇక్కడ ఆ దేశానికి సంబంధించిన ఆఫీస్ లకి వెళ్లి సరైన పత్రాలు చూపించి, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది,అక్కడి అధికారులకి నచ్చితేనే మనకి వీసా జారీ చేస్తారు.సాధారణంగా విదేశాలకు టూర్ కోసమైనా.. లేక చదువు కోసం వెళ్లాలన్నా వీసా తప్పనిసరిగా అవసరమవుతుంది. కొన్నిసార్లయితే వీసా సమస్యల వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వీసా లేకుండా ఈ దేశాలు వెళ్ళవచ్చు.ఇప్పుడు ఇండియన్ పాస్‌పోర్టు మరింత పటిష్టంగా మారడంతో చాలా దేశాలు భారతీయులకు వీసా లేకుండానే పర్యటించడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
Video Advertisement
మరి ఆ దేశాలేవో ఓ లుక్కేయండి… వీలుంటే ఏ విహారయాత్రకో ప్లాన్ చేసుకోండి..
కెన్యా – ఈ దేశానికైతే వెళ్ళిన వెంటనే ఇస్తారు. దాంతో మూడు నెలలు అక్కడ ఉండవచ్చు.
ఇండోనేషియా – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు
ఆండోరా – ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండవచ్చు
మారిషస్ – ఈ దేశానికైతే అసలు వీసానే లేకుండా 90 రోజులుండవచ్చు
కేప్ వెర్డే – ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. గడువు లేదు.
జోర్డాన్ – అక్కడకు వెళ్ళగానే రెండు వారాలకు వీసా ఇస్తారు. కానీ చేతులో 3000 అమెరికన్ డాలర్లు ఉండాలనే నిబంధన ఉంది.
ఫిజీ – ఈ దేశానికి అసలు వీసా లేకుండా నాలుగు నెలలు ఉండవచ్చు.
పలావ్ – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు.
సీషెల్స్ – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు అనుమతి పత్రం ఇస్తారు.
హైతీ – ఈ దేశంలో అసలు వీసా లేకుండా 3నెలలు ఉండవచ్చు.
గునియా బిస్సావ్ – ఈ దేశానికి వెళ్ళగానే 90 రోజులకు వీసా ఇస్తారు.
కంబోడియా – అక్కడకు వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు.
ఈ సల్వడార్ – ఈ దేశంలో అసలు వీసా లేకుండా 90రోజులు ఉండవచ్చు.
సెయింట్ లూసియా – ఈ దేశానికి వెళ్ళగానే ఇస్తారు. 6 వారాలు గడువు.
మడగాస్కర్ – ఈ దేశానికి వెళ్ళగానే 90రోజులకు అనుమతిస్తూ వీసా ఇస్తారు.
సమో – ఈ దేశంలో వీసా లేకుండానే 30రోజులు ఉండవచ్చు.
లావోస్ – ఈ దేశానికి వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు.
మాల్దీవులు – ఈ దేశానికి వెళ్ళగానే ఇస్తారు. 90రోజుల గడువు.
బొలీవియా – ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. 90 రోజుల గడువుంది
సోమాలియా – అక్కడికి వెళ్ళగానే ఇస్తారు. కానీ అక్కడికి వెళ్ళడానికి రెండు రోజుల ముందుగానే మిమ్మల్ని ఆహ్వానించిన వారు అక్కడి విమానాశ్రయంలో దరఖాస్తుని సమర్పించాలి.
డామినికా – ఈ దేశానికి వెళ్ళగానే 6నెలలకు వీసా ఇస్తారు.
నౌరూ – ఈ దేశానికి వెళ్లగానే ఇస్తారు. గడువు లేదు.
జమైకా – ఈ దేశానికి వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు.
మైక్రోనేషియా – అక్కడకు వెళ్ళగానే ఇస్తారు. 30రోజుల గడువు.
శ్రీలంక – ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అనే పద్ధతి అనుమతిస్తారు. గడువు 30 రోజులు.
నేపాల్ – ఈ దేశానికి వెళ్ళాలంటే పాస్ పోర్టు కూడా అక్కరలేదు. ఒక గుర్తింపు పత్రం ఏదైనా ఉంటే చాలు. అంతే కాక ఆ దేశానికి వచ్చేభారతీయులు స్వేచ్ఛగా తిరగడమే కాక అక్కడ జీవించవచ్చు కూడా.
టాంజానియా – వీసా అక్కడకు వెళ్ళగానే ఇస్తారు. గడువు లేదు.
భూటాన్ – అక్కడకు వెళ్ళాలంటే వీసా అక్కరలేదు. గడువు కూడా లేదు.
ఈ దేశాలలో పర్యటించడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని, మీరు ఈసారి టూర్ కి వెళ్లాలనికున్నపుడు ఈ దేశాల గురుంచి కూడా ఆలోచించండి.
End of Article