విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం జమ్మ దేవి పేట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు పెద్దేరు వాగు దాటుతుండగా ప్రమాద వశాత్తు నీటి లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఎల్ . గవరవరం గ్రామానికి చెందిన జాహ్నవి ( 11 ) ,ఝాన్సీ( 8 ),షర్మిల ( 7 ), మహీందర్ ( 7 ) గా గుర్తించారు.సోమవారం మధ్యాహ్నం వాగు దాటుతుండగా లోతు ఎక్కువ గా ఉండటం తో ప్రమాదం జరిగింది.

visakha incident

వాగు లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం తో చిన్నారులు వాగు లో కొట్టుకుపోయారు .విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. చిన్నారుల మృతి తో తల్లి తండ్రులు బోరున విలపిస్తున్నారు . అందరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం తో ఎల్ .గవరవరం లో విషాద ఛాయలు ఏర్పడ్డాయి. నలుగురు చిన్నారులూ గిరిజన కుటుంబాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.