భక్త కన్నప్ప సినిమా కోసం అంత మంది పని చేశారా…?

భక్త కన్నప్ప సినిమా కోసం అంత మంది పని చేశారా…?

by Mounika Singaluri

Ads

మంచి విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా తరికెక్కుతున్న చిత్రం భక్తకన్నప్ప. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. ఈ చిత్రాన్ని నిర్మాత మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది మంచు ఫ్యామిలీ డ్రీమ్ సబ్జెక్టుగా చెప్పుకుంటున్నారు.

Video Advertisement

ఈ చిత్రంలో సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మోహన్ బాబు అందించారు. ఈ చిత్రం కోసం ఏకంగా 600 మంది హాలీవుడ్ టెక్నీషియన్ పనిచేసినట్లుగా తెలిపారు. వందమందికి పైగా భారతీయ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలియజేశారు.90 రోజులపాటు ఒక షెడ్యూల్ కొనసాగిందని అన్నారు. న్యూజిలాండ్ లో అందమైన లోకేషన్ లో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుందని, దేవుడి దయ వల్ల ఎటువంటి అడ్డు లేకుండా ఈ చిత్రం షూటింగ్ ముందుకు కదులుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహాభారత్ సీరిస్ ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది


End of Article

You may also like