Ads
- చిత్రం : దాస్ కా ధమ్కీ
- నటీనటులు : విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్, రావు రమేష్.
- నిర్మాత : కరాటే రాజు
- దర్శకత్వం : విశ్వక్ సేన్
- సంగీతం : లియోన్ జేమ్స్
- విడుదల తేదీ : మార్చ్ 22, 2023
Video Advertisement
స్టోరీ :
సినిమా అంతా హైదరాబాద్ లో ఉండే ఒక వెయిటర్ తో మొదలవుతుంది. ఒక స్టార్ హోటల్ లో కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు. చాలా మిడిల్ క్లాస్ వ్యక్తి అయిన కృష్ణ దాస్ కి ఒక మంచి డబ్బున్న వాళ్ళ లైఫ్ స్టైల్ గడపాలి అని ఉంటుంది. తాను బాగా డబ్బు ఉన్న వాడిని అని చెప్పి కీర్తి (నివేతా పేతురాజ్) అనే ఒక అమ్మాయిని ప్రేమించినట్టు నటించి మోసం చేస్తాడు. క్యాన్సర్ ని నయం చేయడానికి సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) ఫార్మా కంపెనీ నడుపుతూ ఉంటాడు.
చూడడానికి కృష్ణ దాస్, సంజయ్ రుద్ర ఒకటే లాగా అనిపిస్తారు. ఒక 10,000 కోట్ల డీల్ కోసం ధనుంజయ్ (అజయ్), సంజయ్ రుద్ర గొడవ పడుతూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల కృష్ణ దాస్ సంజయ్ రుద్ర స్థానంలోకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది. అసలు సంజయ్ కి ఏమయ్యింది? కృష్ణ దాస్ అతని స్థానంలోకి ఎందుకు వెళ్ళాడు? ధనుంజయ్ తో ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయట పడతాడా? కంపెనీ పరిస్థితి ఎలా మెరుగు అయ్యింది? కీర్తికి ఈ విషయాలు అన్నీ తెలిసి తాను ఏం చేసింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఒక హీరో నటించడం మాత్రమే కాకుండా డైరెక్షన్ కూడా చేయడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి టాలెంట్ ఉన్న హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు హీరో విశ్వక్ సేన్. ఇంతకుముందు ఫలక్ నామా దాస్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాతో దర్శకుడిగా మరొకసారి ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో నటించడం, దర్శకత్వం వహించడం అనేది పెద్ద సాహసమైన విషయం అంటే విశ్వక్ ఇందులో రెండు పాత్రల్లో నటించారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ రెండు పాత్రల్లో బాగా నటించారు. ఆ పాత్రలకి ఉన్న తేడాని బాగా చూపించారు. హీరోయిన్ నివేత కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. రావు రమేష్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. అలాగే మరొక పాత్రలో నటించిన అజయ్ కూడా తన పాత్రకి తగ్గట్టుగా నటించారు. లియోన్ జేమ్స్ అందించిన పాటలు బాగున్నాయి. అయితే కథకి ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా చూపించే విషయంలో ఉన్న లోపాలు ప్రేక్షకులకి కనిపిస్తూ ఉంటాయి.
ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగుతుంది. చాలా వరకు రొటీన్ గా అనిపిస్తుంది. మళ్లీ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ లో ఏమవుతుంది అనే ఆసక్తి వచ్చేలాగా చేస్తుంది. మళ్లీ సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఉంది. కానీ అది కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. మధ్యలో కృష్ణ దాస్, సంజయ్ రుద్ర వారి స్థానాలని మార్చుకునే సీన్స్ ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకులకి కూడా కన్ఫ్యూజన్ వచ్చేలాగా చేశాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- విశ్వక్ సేన్
- నిర్మాణ విలువలు
- పాటలు
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- ఎక్కువైన యాక్షన్ సీన్స్
- సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చూద్దాం అనుకునే వారికి దాస్ కా ధమ్కీ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article