ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోల్లో ఒకరు విశ్వక్ సేన్. ఇటీవల పాగల్ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా డీసెంట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ కొన్ని సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే విశ్వక్ సేన్ తనకి సంబంధాలు కావాలి చూసి పెట్టండి అంటూ సోషల్ మీడియాలో అడిగారు. ఇది నిజంగా కాదు. సినిమా కోసం. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తదుపరి సినిమా అశోకవనంలో అర్జునుడి కళ్యాణం.

vishwak sen

ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోని ఇవాళ విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ తనకి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి అంటూ వివరాలు అన్నీ మాట్లాడారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా మాత్రమే కాకుండా తమిళ్ హిట్ ఓ మై కడవులే కి రీమేక్ గా రూపొందుతున్న సినిమాలో కూడా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ దశలో ఉన్నాయి అని సమాచారం.

watch video :