బాలు గారిపై చెస్ మాస్టర్ “విశ్వనాధ్ ఆనంద్” ట్వీట్ వైరల్…మరో కొత్త కోణాన్ని బయటపెట్టారుగా.!

బాలు గారిపై చెస్ మాస్టర్ “విశ్వనాధ్ ఆనంద్” ట్వీట్ వైరల్…మరో కొత్త కోణాన్ని బయటపెట్టారుగా.!

by Mohana Priya

Ads

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్తులయ్యారు. బాలు గారి మరణం తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఎంతో మంది బాధలో ఉన్నారు. ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులు కూడా బాలు గారి మరణం పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే బాలు గారి మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. బాలు గారికి సినిమా ఇండస్ట్రీలో, అలాగే బయట కూడా ఎంతో మంది మిత్రులు ఉన్నారు.

Video Advertisement

 

వాళ్ళందరూ బాలు గారి గురించి చెప్పే మాటలు వింటే ఆయన గొప్ప కళాకారుడు మాత్రమే కాకుండా ఎంతో గొప్ప వ్యక్తి అనే విషయం కూడా అర్థమవుతుంది. అయితే బాలు గారి మరణం పై సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులలో చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఒకరు. విశ్వనాథన్ ఆనంద్ బాలు గారి గురించి ఈ విధంగా ట్వీట్ చేశారు.

ఇందులో 1983 లో విశ్వనాథన్ ఆనంద్ టీం చెన్నై కోల్ట్స్ ని నేషనల్ టీం ఛాంపియన్ షిప్ కి వెళ్ళటానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు స్పాన్సర్ చేశారు అనే విషయాన్ని మెన్షన్ చేశారు విశ్వనాథన్ ఆనంద్. ఈ విషయంపై నిన్న ఎన్డీటీవీ (NDTV) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథన్ ఆనంద్ ఈ విషయం గురించి ఈ విధంగా మాట్లాడారు ” ఆరుద్ర అనే ఒక ప్రముఖ తెలుగు సినీ రచయిత ఉండేవారు. ఆయన చెస్ ఆడే వారు. 1983 లో ఒక జూనియర్ టీం ని నేషనల్ టీం ఛాంపియన్ షిప్ కి పంపాలి అనుకున్నారు.

ఆరుద్ర గారు బాలు గారిని జూనియర్ టీం కి స్పాన్సర్ చేయమని అడిగారు. బాలు గారు స్పాన్సర్ చేయడానికి ఒప్పుకున్నారు. అలా మేము బాంబే కి వెళ్లి ఆడాము. ఇది నాకు బ్రేక్ త్రూ. ఎందుకంటే నాకు ఈ ఆట ద్వారా వచ్చిన బ్రేక్ తర్వాత నుంచి నేను క్లబ్ ప్లేయర్ నుండి నేషనల్ ఈవెంట్స్ కి ఆడటం మొదలు పెట్టాను. చాలా సంవత్సరాల తర్వాత నేను బాలు గారిని ఒక ఎయిర్ పోర్ట్ లో కలిసాను. బాలు గారికి హలో చెప్పడానికి వెళ్లి, ఆయన మాకు స్పాన్సర్ చేసిన విషయం గుర్తు చేయడానికి ప్రయత్నించాను.

అది ఆయన ఒక ఫ్రెండ్ కి ఫేవర్ గా చేశారు. అందుకే నేను ఆయనకి ఆ విషయం గుర్తు ఉంటుంది అని అనుకోలేదు. కానీ ఆయన నన్ను మధ్యలోనే ఆపి ఆయనకి గుర్తుంది అని చెప్పారు. చాలా ఎఫెక్షనేట్ గా మాట్లాడారు. ఆయన అంత గొప్ప లెజెండ్ మాత్రమే కాకుండా ఎంతో జెంటిల్ పర్సన్ అని నాకు అనిపించింది. ఆయనతో నేను మాట్లాడిన ప్రతి మీటింగ్ నేను గుర్తుపెట్టుకుంటాను. ఆయన ఇలా ఎంతో మందికి సహాయం చేసి ఉంటారు. కానీ ఎప్పుడూ, ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ సమయంలో ఆయన ఒక జూనియర్ చెస్ టీం కి హెల్ప్ చేస్తున్నారు. కానీ నాకు మాత్రం అది నా బ్రేక్ త్రూ ఈవెంట్. ఒక రకంగా నేను ఆయనకి రుణపడి ఉన్నాను.

ఆయన మ్యూజిక్ తో కూడా ఎంతగానో అలరించారు. నాకు బాలు గారు తమిళ్ లో పాడిన పాటలు ఎక్కువగా తెలుసు. గత నెల ఆయన హాస్పిటల్లో ఉన్నారు అన్న విషయం తెలియగానే నాకు చాలా ఆందోళనగా అనిపించింది. నేను దేవుణ్ణి ప్రార్ధించాను. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు అని అన్నారు. కానీ నిన్న క్రిటికల్ గా ఉంది అని వినంగానే ఎంతో బాధగా అనిపించింది. ఇవాళ ఈ వార్త వినగానే ఇంకా బాధగా ఉంది (హార్ట్ బ్రోకెన్). నేను కలిసిన మంచి వ్యక్తుల లో ఆయన ఒకరు” అని అన్నారు.

watch video:

 


End of Article

You may also like