నిజంగా షూటింగ్ లో జరిగేది ఒకటి…మనకి సినిమాలో చూపించేది ఇంకోటి.! ఈ 10 ఓ లుక్ వేయండి.!

నిజంగా షూటింగ్ లో జరిగేది ఒకటి…మనకి సినిమాలో చూపించేది ఇంకోటి.! ఈ 10 ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

Ads

ఒక సినిమా బాగా రావాలి అంటే మంచి పాటలు, డాన్స్, కథ, దర్శకత్వం, నటన మాత్రమే కాకుండా సినిమా నిర్మాణం కూడా రిచ్ గా ఉండడం ఇంపార్టెంట్. మంచి సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేక నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి . అంతే కాకుండా లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే అంతకు ముందు హీరో హీరోయిన్లు ఇంకా మిగిలిన నటులు ఏదైనా సీన్ షూట్ చేయాలి అంటే బయటికి వెళ్లి షూట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి ఉదాహరణ సరిలేరు నీకెవ్వరు.

Video Advertisement

సరిలేరు నీకెవ్వరు సినిమాలో కొండారెడ్డి బురుజు కనిపిస్తుంది. అంతకుముందు ఒక్కడు సినిమాలో కూడా కొండారెడ్డి బురుజు ఉంటుంది. అయితే ఇప్పుడు కొండారెడ్డి బురుజు దగ్గర షూట్ చేయడం కష్టం కాబట్టి రామోజీ ఫిలిం సిటీలో కొండారెడ్డి బురుజు సెట్ వేశారు. సరే ఇప్పుడు గ్రాఫిక్స్ విషయానికి వస్తే, మనం సినిమాల్లో కొన్ని సీన్స్ డ్రీమీ గా ఉండాలి అనుకుంటాం. అంటే నిజజీవితంలో అలాంటివి జరగవు. దీనికి ఉదాహరణ డార్లింగ్ సినిమా.

ఈ సినిమాలో ఒక పాటలో హుస్సేన్ సాగర్ దగ్గర మంచు కురుస్తుంది. నిజంగా అయితే హుస్సేన్ సాగర్ దగ్గర మంచి కురవడం అనేది అసలు ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ డార్లింగ్ సినిమా లో అలా ఉంచుకోవడానికి కూడా కష్టమైన విషయాన్ని గ్రాఫిక్స్ సహాయంతో నిజం చేశారు. అందుకే సినిమా వచ్చి పదేళ్లయినా కూడా ఆ సీన్ మాత్రం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

ఇలాంటి గ్రాఫిక్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (సి జి ఐ), ఇంకొకటి విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్). ఒకవేళ ఏదైనా లేని దాన్ని సృష్టించాలి అంటే సి జి ఐ వాడతారు. ఉన్న దానికే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అన్నప్పుడు విఎఫ్ఎక్స్ వాడతారు.

ఇప్పుడు ఈగ సినిమాలో ఈగ ఉండదు, కాబట్టి ఈగ కనిపించడం కోసం సి జి ఐ ద్వారా ఈగ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాయి కాబట్టి, సినిమాల్లో ఎక్కువగా జంతువులని, మూగజీవాలని వాడట్లేదు. అందుకే సినిమా మొదలయ్యేటప్పుడు సినిమా షూటింగ్ సమయంలో ఎటువంటి జంతువులకు హాని కలగలేదు అని ఇస్తారు.

కానీ సినిమాలో జంతువులు ఉంటాయి. దానికి కారణం సిజిఐ ద్వారా జంతువులని లేదా ఇంకేదైనా మూగజీవాలని క్రియేట్ చేస్తారు. అలాగే ఇమాజినరీ వాటిని క్రియేట్ చేయాలన్నా కూడా సిజిఐ కావాలి. కోటలు, జలపాతాలు అలాంటివి.  లేని వాటిని క్రియేట్ చేయడం అంటే ఏంటో వినయ విధేయ రామ లోని ఈ సీన్ చూస్తే మీకే అర్థమవుతుంది.

ఇప్పుడు విఎఫ్ఎక్స్ విషయానికొస్తే సినిమాలో హీరో లేదా వేరే నటుల కి దెబ్బలు తగిలినట్టు చూపించడం, లేదా చుట్టూ ఉన్న వాతావరణం మార్చడం అంటే ఉన్నవాటికే ఇంకేమైనా యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు విఎఫ్ఎక్స్ వాడతాం. ఉన్నవాటికి ఎక్స్ట్రా యాడ్ చేయడం అంటే ఏంటో మెర్సల్ (తెలుగులో అదిరింది) లోని ఈ సీన్ చూస్తే మీకే అర్థమవుతుంది.

అలాగే కొంతమంది హీరో హీరోయిన్లు ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ఇష్టపడరు. వారిలో సూర్య ఒకరు. అందుకే మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్) సినిమాలో కాజల్ కి ఇంకా సూర్య కి మధ్య జరిగే ఒక సీన్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ వాడారు. ఒకసారి ఆ సీన్ చిత్రీకరణ చూస్తే మీకే అర్థమవుతుంది.

దాదాపు అన్ని సినిమాల్లో ఎక్కడో ఒక చోట విఎఫ్ఎక్స్ వాడతారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయిన విఎఫ్ఎక్స్ స్టూడియోస్ లో మొదటిది పిక్సెల్లాయిడ్. పిక్సెల్లాయిడ్ సంస్థ భాగమతి, ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, భరత్ అనే నేను, ధ్రువ, మణికర్ణిక,  సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీరామరాజ్యం, అత్తారింటికి దారేది ఇలా ఎన్నో సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.

ఇంకొకటి NY విఎఫ్ఎక్స్ వాలా. ఇది హీరో అజయ్ దేవ్ గన్ ది. హిందీ సినిమాలకి మాత్రమే కాకుండా కొన్ని తమిళ సినిమాలకి కూడా NY విఎఫ్ఎక్స్ వాలా విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. వాటిలో అదిరింది, గ్యాంగ్, విజిల్, చెలియా, పోలీసోడు, కాష్మోరా సినిమాలు తెలుగులోకి కూడా అనువాదం అయ్యాయి.

ఇంకొకటి మకుట విఎఫ్ఎక్స్. రంగస్థలం, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూషన్, కాలా కరికాలన్, నేనే రాజు నేనే మంత్రి, గోపాల గోపాల, ఐ, ఆగడు, మనం, వన్ నేనొక్కడినే, ఈగ, సెవెంత్ సెన్స్, బద్రీనాథ్, ఇంకా ఎన్నో సినిమాలకు మకుట విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.

నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ తో పాటు ఒక విఎఫ్ఎక్స్ సంస్థ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. అదే అద్వైత క్రియేటివ్ స్టూడియోస్. ఓం 3డి, లెజెండ్, నాన్నకు ప్రేమతో, పటాస్, కిక్ 2, కృష్ణాష్టమి ఇంకా ఎన్నో సినిమాలకు  అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ అందించారు.

ఒక్క సినిమాకి ఒక్క సంస్థ కాకుండా ఒక్కోసారి రెండు మూడు సంస్థలు కూడా విజువల్ ఎఫెక్ట్స్ కోసం పని చేస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా సినిమా తీయొచ్చు. కానీ షూటింగ్ జరిగినప్పుడు లైటింగ్ అదంతా సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. సినిమాటోగ్రఫీ లో కూడా ఒక పరిధి వరకు మాత్రమే ఎఫెక్ట్స్ యాడ్ చేయగలుగుతారు. వీటన్నిటికీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా తోడైతేనే ఆ సీన్ లో ఉన్న అవసరమైన ఎలిమెంట్స్ అన్ని స్క్రీన్ మీద కరెక్ట్ గా ప్రజెంట్ అవుతాయి.


End of Article

You may also like