Ads
ఇటీవల తమిళ సీరియల్ నటి, వీజే చిత్ర అనుమానాస్పద స్థితిలో మరణించారు. చిత్ర చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నారు అని అన్నారు. కానీ ఇది ఆత్మహత్య కాదు ఏమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిత్ర తల్లి కూడా తన కూతురిని తన భర్త హేమంత్ రవి హింసించేవాడు అని, చిత్ర ఒంటిపై గాయాలున్నాయని, హత్యని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, చిత్ర మరణానికి గల అసలు కారణం వెలుగులోకి రావాలి అని ఫిర్యాదు చేశారు.
Video Advertisement
ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమయం కథనం ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, చిత్ర సహ నటీనటులని, స్నేహితులని, హేమంత్ ని పలుమార్లు ఇంటరాగేట్ చేసి, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చిత్ర చనిపోవడానికి కారణం తన భర్త హేమంత్ అని నిర్ధారించారు.
ఈ విషయంపై నజరత్ పేట్టై పరిధిలోని ఏసీపీ సుదర్శన్ మాట్లాడుతూ “ఒక టెలివిజన్ షోలో చిత్రం నటించిన ఒక సీన్ పై హేమంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు అని, ఈ విషయంపై చిత్రకి, హేమంత్ కి మధ్య గొడవ జరిగిందని, హోటల్ లో జరిగిన గొడవలో హేమంత్ చిత్రని బలంగా తోశారు, దాంతో చిత్ర మనస్తాపానికి గురయ్యారు” అని పేర్కొన్నారు.
పోస్టుమార్టం రిపోర్ట్ లో చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు అని తేలినప్పటికీ కూడా, చిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది హేమంత్ అవ్వడంతో పోలీసులు హేమంత్ ని అరెస్ట్ చేశారు. చిత్రకి, హేమంత్ కి ఆగస్టులో ఎంగేజ్మెంట్ జరిగింది. వీరిద్దరూ అక్టోబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వచ్చే జనవరిలో సంప్రదాయం ప్రకారం మళ్ళీ వివాహం చేసుకోవాలని అనుకున్నారు.
End of Article