“అఖిల్ విషయంలో బాధపడుతూ ఉంటా..!” అంటూ… దర్శకుడు “వి.వి.వినాయక్” కామెంట్స్..!

“అఖిల్ విషయంలో బాధపడుతూ ఉంటా..!” అంటూ… దర్శకుడు “వి.వి.వినాయక్” కామెంట్స్..!

by Mohana Priya

Ads

ఎన్నో కమర్షియల్ విజయాలని అందుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు వి.వి. వినాయక్. పెద్ద హీరోలకి మాత్రమే కాకుండా యంగ్ హీరోలకి కూడా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు అందించారు వినాయక్. చిరంజీవికి ఠాగూర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి ఆది లాంటి సూపర్ హిట్ సినిమాలని అందించారు. వి.వి. వినాయక్ కొద్ది సంవత్సరాల క్రితం రూపొందించిన ఇంటెలిజెంట్ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు.

Video Advertisement

దాంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సరే మళ్లీ కం బ్యాక్ ఇవ్వాలి అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ తో బాలీవుడ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే వి.వి. వినాయక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

vv vinayak about akhil movie

అందులో వి.వి. వినాయక్ అఖిల్ సినిమా గురించి కూడా మాట్లాడారు. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన అఖిల్ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఇది అఖిల్ మొదటి సినిమా. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఇదే విషయంపై వి.వి.వినాయక్ మాట్లాడారు. ఇంటర్వ్యూలో వి.వి.వినాయక్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. “అఖిల్ సినిమా విషయంలో మేము అనుకున్నట్టుగా జరగలేదు. అక్కినేని హీరో ఇందులో హీరోగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. కానీ ఊహించని ఫలితం వచ్చింది.”

“దాంతో ఈ సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదు అనుకున్నాను. అందుకే అది ఒక పెద్ద మనిషిని పెట్టి బయ్యర్లకి డబ్బులు ఇచ్చి వాళ్లు ఇబ్బంది పడకుండా చూశాను. ఈ విషయంపై నాకు ఎటువంటి బాధ లేదు. కానీ అఖిల్ నాతో సినిమా చేయాలి అని ఇష్టపడి, చాలా ప్రేమించి ఈ సినిమా చేశాడు. అలాంటి హీరో కి నేను సక్సెస్ ఇవ్వలేకపోయాను అని అనిపిస్తూ ఉంటుంది. అఖిల్ ఏదో ఒక రోజు పెద్ద సూపర్ స్టార్ అవుతాడు. కానీ అఖిల్ సినిమా తనకి బరువు అయ్యింది అని అనుకుంటున్నాను. అది కూడా మా అత్యాశ అనుకోవాలి. రిలీజ్ విషయంలో కూడా సీజీ ఇంకా అవ్వలేదు. సినిమా పూర్తిగా చూడలేదు” అని వి.వి. వినాయక్ అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like