Home Viral ఏంటి.? పెళ్లికి ఇలా కూడా పిలుస్తారా… వైరల్ అవుతున్న రూల్స్ లిస్ట్..!

ఏంటి.? పెళ్లికి ఇలా కూడా పిలుస్తారా… వైరల్ అవుతున్న రూల్స్ లిస్ట్..!

by Mohana Priya

పెళ్లి అంటే ఎక్కడైనా సరే వారి సాంప్రదాయానికి తగ్గట్టు చేసుకుంటారు. విదేశాల్లో అయినా సరే వారి ఆచారానికి తగ్గట్టు ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంటారు. అయితే, పెళ్లికి పిలవడం అనేది ఆ వ్యక్తుల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంత మంది గిఫ్ట్ పంపిస్తే, ఇంకొంత మంది కేవలం వెడ్డింగ్ కార్డ్ పంపిస్తారు. ఇంకొంతమంది అయితే ఈ మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ విషయాన్ని అందరికీ చెప్తారు.

wedding rules made for guests going viral

ఇటీవల ఒక జంట కూడా ఇలాగే మెయిల్ ద్వారా వారి బంధుమిత్రులకి వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ లో ఆ గెస్ట్ లు ఎలా రావాలి అనే ఇది కూడా పాయింట్స్ రూపంలో రాసారు. ఆ పాయింట్స్ ఏంటంటే.

wedding rules made for guests going viral

# 15-30 నిమిషాల కంటే ముందు రండి.

# వైట్ కలర్, గ్రే కలర్, లేదా ఐవరీ కలర్ దుస్తులు వేసుకోకండి.

# పోనీ టైల్, బాబ్ కాకుండా ఇంక ఏ హెయిర్ స్టైల్ వేసుకోకండి

# ముఖానికి ఎక్కువ మేకప్ వేసుకోకండి.

# పెళ్లి వేడుకను రికార్డ్ చేయకండి.

# మేము చెప్పేంతవరకు ఫేస్ బుక్ చెక్ చేయకండి.

# పిక్చర్స్ పోస్ట్ చేసేటప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ వాడండి.

# పెళ్లి కూతురుతో అస్సలు మాట్లాడకండి.

# 75 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ చేసే గిఫ్ట్ తో పెళ్లికి వస్తే మాత్రమే లోపలికి వచ్చే అనుమతి ఉంటుంది.

wedding rules made for guests going viral

లిస్ట్ చాలా వింతగా ఉంది కదా. ఈ లిస్ట్ ని రెడిట్ లో ఒకరు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like