కొంతమంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు.కానీ కొంతమంది జీవితంలో ఎదురు అయ్యే చిన్న చిన్న విషయాలకే నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.అయితే మరికొంతమంది మాత్రం ఆత్మహత్య చేసుకుందాం అని నిర్ణయించుకున్నప్పుడు తమ పిల్లలని కూడా వారితో పాటు చంపేస్తూ ఉంటారు.కాగా ఇదే విధంగా హైదర్షాకోట్ లో ఓ సంఘటన జరిగి అంతటా కలకలం రేపుతోంది.భార్గవి అనే మహిళా తనతో పాటు తన 10 సంవత్సరాల కుమారుడుని కూడా చంపేసింది.ఆ సమయంలో భార్గవి ఇంకో సంతానం ఐన 14 నెలల కుమారుడు పనిమనిషితో పాటు బేకారి షాప్ కి వెళ్లడం వలన తన ప్రాణాలకు ఏ హాని జరగలేదు…పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

representative image

30 యేళ్ళ భార్గవి అనే మహిళా హైదర్షాకోట్ లో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.తన భర్త ఇద్దరు పిల్లల్తో కలిసి హైదర్షాకోట్ లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు భార్గవి.అయితే గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు భార్గవి.అయితే ఎప్పటినుండో భార్గవి కి ఆత్మహత్య చేసుకొని చనిపోదామనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది.అయితే భార్గవి ఇంట్లో పని చేసే పనిమనిషి తన ఏడాదిన్నర పిల్లాడిని బేకారి షాప్ కి తీసుకువెళ్ళింది.అయితే ఆ సమయంలో తన 10 సంవత్సరాల పిల్లవాడికి కళ్ళకి గంతలు కట్టి ఉరివేసింది భార్గవి.

అనంతరం తాను కూడా ఉరివేసుకొని చనిపోయింది.మొదట వీరి మరణం వెనకాల ఏదో మిస్టరీ ఉన్నటు అంతా అభిప్రాయపడ్డారు.కానీ మృతదేహాలను పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆత్మహత్య అని రిపోర్ట్ వచ్చింది.అయితే పోస్ట్ మార్టం అనంతరం మృత దేహాలను భార్గవి భర్త కు అప్పగించారు.కాగా మృత దేహాలకు భార్గవి సొంత ఊరు ఐన గుంటూరు లో దహన సంస్కారాలు నిర్వహించారు.