పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన చర్చలకు దారి తీసింది. సాక్షి కథనం ప్రకారం గర్సికూటి పావని, తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన యువతి. పావని కొవ్వూరు ఏబీఎన్‌ అండ్‌ పీఆర్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తాడేపల్లిగూడెంలో ఇంటర్ చదువుతున్నప్పుడు అంబటి కరుణ తాతాజీ నాయుడు పావనిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరూ కొంతకాలం సన్నిహితంగా ఉన్నారు.

a girl killed her boy friend with knife

పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు కులాలు వేరు కావడంతో అంబటి కరుణ తాతాజీ నాయుడు పెళ్లికి అంగీకరించలేదు. పావని ఒత్తిడి చేయడంతో, వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకొని సహజీవనం చేశారు. తర్వాత తనని అధికారికంగా పెళ్లి చేసుకోమని పావని అడగడంతో అందుకు తాతాజీ నాయుడు అంగీకరించలేదు. పావని పై అనుమానం పెంచుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశాడు.

a girl killed her boy friend with knife

అతని వేధింపులు తట్టుకోలేక పావని తన స్వగ్రామం అయిన మలకపల్లి కి వచ్చేసింది. సోమవారం పావని కి కాల్ చేసి మాట్లాడాలని ఐ.పంగిడి జంక్షన్‌కి రమ్మని కోరాడు తాతాజీ నాయుడు. పావని అక్కడికి వెళ్ళింది. వాళ్లిద్దరికీ మధ్య గొడవ జరిగింది. పావని తనని ఇంటి దగ్గర దింపమని అడగడంతో ఇద్దరూ మోటార్ సైకిల్ పై బయలుదేరారు.

అప్పటికే మనస్తాపానికి గురైన పావని ధర్మవరం గ్రామ శివారుకు వచ్చేసరికి తాను అంతకుముందు ఆన్లైన్లో కొన్న చాకుతో తాతాజీ నాయుడు మెడపై పొడిచింది. తర్వాత అతను పడిపోవడంతో చాకుతో పలుచోట్ల దాడి చేసింది. తాతాజీ నాయుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పావని పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయింది. రూరల్‌ ఎస్‌ఐ కె.రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.